ఏపీ రాజకీయాలు రోజు రోజు కి ప్రజలలో ఉత్ఖంతని పెంచుతున్నాయి..విశ్లేషకులని సైతం ఆశ్చర్యపరిచేలా రోజుకో మలుపు తిరుగుతోంది..జనసేన ఆవిర్భావం నుంచీ మొదలు నిన్నా మొన్నటి వరకూ కూడా పవన్ కళ్యాణ్ తప్ప చిరు ఫ్యామిలీ తరుపు ఎవరూ కూడా పవన్ జనసేన పార్టీలో పని చేయలేదు సరి కదా పవన్ కి చిరు ఫ్యామిలీ కి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ వలన మరియు పవన్ అప్పుడప్పుడు చేసిన వ్యాఖ్యల మూలంగా ఇక ఆ ఫ్యామిలీ జనసేనలోకి ఎంట్రీ కష్టమే అనుకున్నారు..అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు జనసేన కి జై కొట్టే పరిస్థితులు వచ్చాయని తెలుస్తోంది.

 Image result for chiru fans join to janasena

గడిచిన కొన్ని నెలల నుంచీ పవన్ కి  మరియు అన్నయ్యలు చిరు నాగబాబుల మధ్య తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయట..అంతేకాదు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో పవన్ ఒక్కడే కాపులని తన వైపు తిప్పుకోవాలంటే అది సాధ్యం అయ్యే పని కాదు అందుకే..అందుకే గత అనుభవాలని దృష్టిలో పెట్టుకున్న మెగా అన్నదమ్ములు ఇప్పుడు జనసేనలో కీలకంగా మారిపోయారు..భవిష్యత్తులో పవన్ కి కొండంత అండగా మెగా ఫ్యామిలీ మొత్తం నిలబడనుంది అందులో బాగంగానే ఈరోజు గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటల్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు, అభిమానులు పవన్ ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు..ఇక్కడి వరకూ బాగానే ఉంది..అయితే

 Image result for chiru fans join to janasena

మరి జనసేనలోకి చిరు నాగబాబు ఎంట్రీ లు ఎప్పుడు అంటే త్వరలోనే ఆ ముహర్తం కూడా ఉంటుందని అయితే ముందుగా నాగబాబు జనసేన లోకి ఎంటర్ అయ్యిన కొన్ని నెలలకి చిరంజీవి తన తమ్ముడు పార్టీలోకి వస్తారని తెలుస్తోంది..అంతేకాదు చిరు పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పని చేస్తారని కూడా తెలుస్తోంది..మరొక విషయం ఏమిటంటే..జనసేన తరుపున ఎంపీ అభ్యర్ధిగా చిరు నిలబడుతారనే సమాచారం కూడా తెలుస్తోంది..అయితే చిరుని ఎక్కడి నుంచీ పోటీ చేయించాలో కూడా పవన్ డిసైడ్ అయ్యారట అయితే తూర్పు లేదా పశ్చిమ గోదావరి జిల్లాల నుంచీ చిరు ని ఎంపీ గా బరిలోకి దించాలనేది పవన్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది..

 Image result for chiru political stiles

ఇప్పటికే చిరు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యి ఢిల్లీ స్థాయిలో బాగానే పలుకుబడి తెచ్చుకున్నారు..అయితే మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఏపీలో ఎన్నికల సమయంలో రంగంలోకి దిగితే కాపు ఓట్లు ఒక్కటికూడా వేరే పార్టీలకి వెళ్ళకుండా జనసేనకి పడతాయనేది వారి వ్యూహాత్మక నిర్ణయంగా తెలుస్తోంది..అయితే ఎన్నికలు దగ్గర పడే సమయంలో కాపుల ఓట్లు కోసం జనసేన మరిన్ని వ్యుహాలని సిద్దం చేసుకుని ఉంచిందని తెలుస్తోంది..అయితే ఈ పరిణామాలు జగన్ కంటే కూడా అధికార పార్టీ తెలుగు దేశానికి తీవ్రనష్టాన్ని చేకూర్చేలా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: