ఈ మద్య కొంత మంది తమకు నచ్చితే..ఏదైనా చేసేస్తాం అన్న రీతిలో సాగుతున్నారు.  ఆ మద్య  రష్యాలో ఫుట్ బాల్ స్టేడియం ముందు ఓ మహిళా జర్నలిస్ట్ పై లైవ్ లోనే ముద్దు పెట్టి టక్కున మాయమయ్యాడు..తర్వాత సారీ చెప్పారనుకోండి. లేడీ రిపోర్టర్లకు ముద్దులు పెడుతూ, పెట్టాలని ప్రయత్నిస్తూ, లైంగికంగా వేధిస్తున్న వీడియోలు బయటకు రాగా, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 

తాజాగా అలాంటి దృశ్యమే మళ్లీ రిపీట్ అయ్యింది..కాకపోతే ఈసారి మహిళపై కాదు పురుషుడిపై..అవును లైవ్ జరుగుతుండగానే రిపోర్టర్ పై ముద్దుల వర్షం కురిపించింది ఇద్దరు అమ్మాయిలు.  దక్షిణ కొరియాకు చెందిన 'ఎంబీఎన్' అనే చానల్ తరఫున పనిచేస్తున్న యువకుడు జియాన్ వాంగ్ రియల్, నడిరోడ్డుపై నిలబడి లైవ్ రిపోర్టింగ్ ఇస్తుంటే, ఇద్దరు రష్యన్ అమ్మాయిలు వచ్చి గట్టిగా పట్టుకుని చుంభించి వెళ్లడం హాట్ టాపిక్ అయింది.  మొదట ఆ రిపోర్టర్ కాస్త కంగారు పడ్డా తర్వాత సిగ్గు పడి నవ్వుకున్నాడు.

  ఇక అమ్మాయిని అబ్బాయి కిస్ చేస్తే, మహిళలకు భద్రత లేదని స్పందించిన వారంతా, ఇప్పుడు పురుష రిపోర్టరుపై జరిగిన లైంగిక వేధింపులపై మాట్లాడరేంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జరిగిన ఘటనపై ఎంబీఎన్ చానల్ స్పందిస్తూ, వరల్డ్ కప్ పోటీలను కవర్ చేసేందుకు రష్యా వెళ్లిన తమ జర్నలిస్టును ఇద్దరు రష్యా అమ్మాయిలు వేధించారని తన ట్విట్టర్ ఖఆతాలో పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: