ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా పదకొండు మంది ఒకే కుటుంబానికి చెందిన వారు సామూహిక ఆత్మహత్య ఢిల్లీలోనే కాదు యావత్ భారత దేశంలో ప్రకంపణలు సృష్టించింది.  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 11 మంది డెత్ మిస్టరీ కేసులో ఒక్కో సంచలన విషయం వెలుగులోకి  వస్తున్నాయి. భాటియా కుటుంబం నివసిస్తున్న ఇంటి గోడలో 11 పైపులు దర్శనమివ్వడం ఈ కేసులో కీలకంగా మారగా... ఇప్పుడు అదే తరహాలో మరో విషయం బయటపడింది. ఇంటి ముందున్న మెయిన్ గేటుకు కూడా 11 ఇనుప గ్రిల్స్ ఉన్నట్టు సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. దీంతో భాటియా కుటుంబంలో మరణించిన 11 మందిని సూచించేలా వీటిని ఏర్పాటు చేశారన్న వార్తలు మళ్లీ గుప్పుమన్నాయి.

ఇక లలిత్ భాటియాకు ఉన్న భ్రమలు, ఆత్మల పట్ల నమ్మకాలే ఈ మరణాలకు కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. లలిత్ భాటియా చేతి రాతతో...  ఇంట్లో దొరికిన డైరీలోని రాతతో సరిపోలినట్టుగా పోలీసులు ప్రకటించారు.  77 ఏళ్ల  నారాయణ దేవి చిన్న కుమారుడు లలిత్‌ భాటియా. తనతో పాటు తన కుటుంబానికే చెందిన మరో 10 మంది సామూహిక ఆత్మహత్యలకు ప్రణాళిక రూపొందించింది కూడ ఇతనే అని  పోలీసులు అనుమానిస్తున్నారు. 
Image result for ఢిల్లీ డెత్ మిస్టరీ
ఇదిలా ఉంటే..11 మంది ఇంటి సభ్యులు మోక్షం కోసం ఇష్టపూర్వకంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలినా, చివరి నిమిషంలో భావనేష్ అనే వ్యక్తి ఆత్మహత్య నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ నివేదికలో ఇదే తేలిందని పోలీసులు తెలిపారు.  అందరూ సామూహిక ఆత్మహత్యకు పాల్పపడినా..బాటియా పెద్ద కుమారుడైన భావనేష్ చివరి నిమిషంలో ఆత్మహత్య వద్దనుకున్నాడు. దీంతో బయటపడేందుకు చివరి క్షణం వరకు ప్రాణాలతో పోరాడాడు.
Image result for ఢిల్లీ డెత్ మిస్టరీ
అంతేకాదు, అతడి చేతులు అందరిలా బిగుతుగా కాకుండా వదులుగా కట్టి ఉండడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. మెడకు బిగుసుకుంటున్న తాడును వదులు చేసేందుకు ప్రయత్నించినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. లలిత్ భాటియా చెప్పిన విషయాలను నమ్మని ఇతర కుటుంబసభ్యులు కూడ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.లలిత్ భాటియా తాను నమ్మిన మూఢ నమ్మకాలతో కుటుంబసభ్యులను బలిగొనేలా చేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: