తెలుగుదేశం మంత్రి గంటా శ్రీనివాసరావు చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. తన రాజకీయ భవిషత్తు కోసం కీలకమైన నిర్ణయాలే తీసుకోబోతున్నారు. దీనికి నాందిగా విశాఖ నగరంలో సొంత సామాజిక వర్గం నాయకులు, వివిధ వర్గాల ప్రతినిధులతో  ఓ డిన్నర్ పార్టీని గంటా ఏర్పాటు చేసి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. ఆ సమావేశంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ గంటా గో ఎహేడ్ అంటూ ప్రోత్సహించారని టాక్. మీరు ఎటువైపు వుంటే మేము కూడా అటే అంటూ  కొత్త  బలాన్ని ఇచ్చారట


ఆ పార్టీ వైపేనా :


గంటా ప్రతి ఎన్నికకూ పార్టీలు మార్చేయడం అలవాటే. ఈ సారి ఆయన ఏ వైపు వెళ్తారన్నది ఇంటెరెస్టింగ్ మాటర్ గా ఉంది. కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెడితే వైసీపీ, జనసేన గంటా ఆప్షన్స్ గా ఉన్నాయి. జనసేనని ఇటీవల విశాఖ మీటింగులలో గంటానే డైరెక్ట్ గా అటాక్ చేశారు. ఆయనను నమ్మి గెలిపిస్తే భీమిలీకి ఏంచేశారంటూ ఓ రేజిలో ఫైర్ అయ్యారు. వలస నాయకులంటూ కూడా ఆడిపోసుకున్నారు. సో ఆ వైపుగా గంటా వెళ్ళే చాన్స్  అయితే కనిపించడం లేదు. దాంతో ఆయన చూపు ఇపుడు వైసీపీ మీదనే ఉందని భావిస్తున్నారు. ఆ పార్టీలో చేరేందుకే గంటా రంగం సిధ్ధం చేసుకున్నారని అంటున్నారు.


ఆయనను కూడానా :


గంటా ఒంటరిగా ఈసారి పార్టీ మార్చడంలేదని భోగట్టా. తన వెంట వియ్యంకుడు నారాయణను కూడా తీసుకువెళ్ళేందుకు రెడీ అయ్యారని సమాచారం. మీ ఇద్దరూ కలిసే చాలు,  బాబుకు చుక్కలు కనిపిస్తాయి అని ఆ మీటింగ్ లో పాల్గొన్న కాపు నాయకులు గంటాతో అన్నారట. అదే విధంగా ఏపీ పాలిటిక్స్ లో తనతో కలసి నడిచే కాపు నేతలను, ఇతర నాయకులనూ కూడా కలుపుకుని గంటా పెద్ద ఎత్తున ఫిరాయించేందుకు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. 


ఆ పార్టీకి చెల్లు చీటీయే :


గంటా టీడీపీలోనే కొనసాగితే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చ జరిగినట్లుగా సమాచారం. ఆయన మళ్ళీ టీదీపీలో ఉండి గెలిచినా బాబు మాత్రం ఎటువంటి ఇంపార్టంట్ ఇవ్వడని, ఉండి ఏం లాభమన్న మాట కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సాధ్యమైనంత తొందరలోనే గంటా తన ఫ్యూచర్ పొలిటికల్ యాక్షన్ ని రెడీ చేసి జెండా మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇదే జరిగితే టీడీపీకి బిగ్ షాక్ తప్పదు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: