ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి తనయుడు...ఐటీ , పంచాయితీ రాజ్ శాఖామంత్రి అయిన లోకేష్  త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? ఏపీలో తెలుగుదేశం పార్టీని మరింతగా బలపరచడానికి లోకేష్ సిద్దమయ్యారా..? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది..త్వరలో రాష్ట్రవ్యాప్తంగా..జిల్లాల వారీగా టీడీపీ ని మరింతగా బలపరచడానికి అదే సమయంలో లోకేష్ తెర ముందుకు తీసుకురావడానికి ఈ పర్యటనలని ఉపయోగించుకోవాలని బాబు నిర్ణయం తీసుకున్నారట.

 Image result for lokesh

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు కేంద్రంలో టీడీపీ జరుగుతున్న కోల్డ్ వార్ మరియు పార్టీలో అతర్గత వ్యవహారాలపై బాబు దృష్టి కేంద్రీకరించారు అయితే  ఈ లోగా లోకేష్  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి శ్రేణులను సమాయత్తం చేయనున్నారు..ఇద్దరూ కూడా పై పైనే ఉంటే క్రింది స్థాయి నేతలని మరియు కార్యకర్తలని సమాయుత్త చేయడానికి ఎవరో ఒకరు ముందు నిలవాలి అదేసమయంలో లోకేష్ తెలుగుదేశానికి కాబోయే సారధి కాబట్టి తానూ ఈ పర్యటన చేస్తేనే పార్టీకి రెండు విధాలుగా ఒక దెబ్బకి రెండు పిట్టలు చందంగా కలిసివస్తుందని చంద్రబాబు లోకేష్ ని రంగంలోకి దించారని తెలుస్తోంది..

 Image result for lokesha with people

అయితే రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే టార్గెట్ గా ఎప్పటినుంచో ప్రణాలికలు సిద్దం చేసుకుని పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్న లోకేష్ అన్నీ తానై పార్టీని గ్రౌండ్ లెవిల్ లో నడుపుతున్నారు...ఇదిలాఉంటే రాజా వ్యూహాల ప్రకారం యువ నేత నారా లోకేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళిక సిద్దం చేశారట.  వారంలో మూడు రోజులు అధికారిక కార్యక్రమాలు చేపడుతూ మరో మూడు రోజులు పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారట.

 Image result for lokesh

అయితే లోకేష్ ఈ పర్యటనలు చేస్తూ ప్రభుత్వం ఏపీలో టీడీపీ చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలకి తెలిసేలా వివరించగలిగి ప్రతీ గ్రామంలోకి తీసుకెళ్లటంతో పాటుగా అక్కడ వారు ఎదుర్కుంటున్న సమస్యలకి వెంటనే అప్పటికప్పుడు పరిష్కారాలు అధికారుల ద్వారా చూపించగలిగి ప్రజలలో ఒక నమ్మకాన్ని లోకేష్ నిలబట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నారట..ఈ పర్యటనలని రెండు మూడు నెలలలో మొదటి షెడ్యులు గా  పూర్తి చేసుకుని మలివిడత పర్యటన కూడా చేసేలాగా రూట్ మ్యాప్ కూడా సిద్దం చేశారట..అయితే అనుకున్నది అనుకున్నట్టుగా గనుకా చేయగలిగితే..లోకేష్ తన మాట తీరుతో ప్రజలని ఆకట్టుకోగలిగితే తప్పకుండా స్వకార్యం స్వామీ కార్యం రెండూ నెరవేరుతాయి అని అభిప్రాయ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: