జమిలి ఎన్నికలకు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎస్ అంటోంది.  ఎంత తొందరగా ఎన్నికలు పెడితే మాకు అంత మంచిదంటోంది. ఓ వైపు అధికార తెలుగుదేశం పార్లమెంట్ కు మాత్రమే ముందస్తు పెట్టి షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీకి ఎన్నికలు జరపాలని వాదిస్తున్న క్రమంలో విపక్షం వైసీపీది షాకింగ్ డెసిషనే.  కలసికట్టుగా ఎన్నికలు వస్తే బీజేపీ తప్పులకు  ఆ పార్టీతో పాటు  బాబుకు కూడా దెబ్బలు పడతాయని వైసీపీ అంచనా వేస్తోంది. ఆ పార్టీ రాజ్య సభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి జమిలి కి సై అంటున్నారు. ఎన్నికలంటే మాకేం భయం అంటూ టీడీపీని గట్టిగా అటాక్ చేస్తున్నారు.


ఇదీ స్ట్రాటజీ  :


పాదయాత్ర పేరుతో జనంలో జగన్ విపరీతంగా తిరుగుతున్నారు. ఇప్పటికి పది జిల్లాలను ఆయన కవర్ చేసేశారు. అడుగు పెట్టిన ప్రతీ చోటా జనం బ్రహ్మరధం పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు ఈ సారి బాగా టర్న్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో జగన్ టీం ఎన్నికలకు రెడీ అంటోంది. ఈ వేడి ఇలా ఉండగానే ఎన్నికలు వస్తే విన్నింగ్ చాన్స్ లు డబుల్ అవుతాయని బలంగా నమ్ముతోంది. ఇక ప్రత్యేక హోదా అస్త్రం ఎటూ వైసీపీ చేతులలోనే ఉంది. ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి త్యాగమూర్తులుగా జనంలో నిలబడ్డారు. దీనిని బాగా వాడుకోవాలంటే ముందస్తు ఎన్నికలు జమిలిగా వస్తేనే బెటర్ అని వైసీపీ అంటోంది.


దబిడి దిబిడేనా  :


టీడీపీ జమిలి ఎన్నికలకు నై అంటోంది. ఎందుచేతనంటే బీజేపీతో కటీఫ్ తరువాతా టీడీపీ ట్రబుల్స్ లో పడింది.  నాలుగేళ్ళుగా చేసిన అభివ్రుధ్ధి ఏమీ లేదు, ఇప్పటికిపుడు ఎన్నికలు అంటే గోతిలో పడినట్లేనని చంద్రబాబు కంగారు పడుతున్నారు.. ఓ వైపు సొంత సర్వేల పేరుతో ఎంతగా షోకు చేసినా గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉందన్న విషయం ఆయనకూ తెలుసు. ఇక మోదీతో పాటే ఎలెక్షన్స్ అంటే ఆ కోపం తన పైనా మళ్ళి అసలుకే ఎసరు పెడుతుందని ఇంకా బాగా తెలుసు. అందుకే అపుడు వూ కొట్టేసిన బాబు, ఇపుడు అసెంబ్లీకి ముందస్తు అంటే నో చెబుతున్నారు.


అక్కడా షాకే :


జమిలి ఎన్నికలు ముందుగా పెట్టేస్తే జనసేనానీ షాక్ తినక తప్పదు. ఇపుడిపుడే జనంలోకి వెళ్తున్న పవన్ పార్టీ రూపూ, రేఖా ఇంకా తీర్చిదిద్దుకోలేదు. పవన్ తిరిగింది ఇంకా ఉత్తరాంధ్రలో మాత్రమే. ఇంకా పది జిల్లాల టూర్ మిగిలే ఉంది. మొత్తం సీట్లకు పోటీ అంటే క్యాండిడేట్లు దొరికే చాన్సే లేదు. పైగా పార్లమెంట్ కూ పోటీ అంటే బిగ్ చాలెంజ్. పాతిక సీట్లకు క్యాండిడేట్లను సెలెక్ట్ చేయాలి.  అంటే పవన్ కి కూడా జమిలి అంటే నో అనాల్సిందే అన్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: