చంద్ర బాబు అబద్దం చెప్పకుండా ఒక్క రోజు కూడా గడపడు అని ప్రతి పక్షాలు విమర్శిస్తుంటారు. ఎన్నికల్లో ఎన్ని అబద్దపు హామీలు ఇచ్చారో మనకందరికీ తెలిసిందే. అయితే రాజకీయ నాయకులకు అవన్నీ అలవాటు. అయితే చంద్ర బాబు నాయుడు విదేశీ పర్యటనల్లో కూడా అమరావతి పొల్యూషన్ ఫ్రీ అని అక్కడ కూడా డబ్బా కొడుతున్నాడు. అయితే ఇప్పుడైతే అమరావతి లో ఏం లేదు కానీ అభివృద్ధి జరిగాక పర్యావరణం దెబ్బతినదు అని చెప్పడం ఆశ్చర్యం కలిగించే అంశమే. 

Image result for chandrababu naidu

ఎంత పర్యావరణ అనుకూలంగా భవనాలు నిర్మించినా, ప్రస్తుతం వున్న పరిస్థితుల కంటే దారుణంగా వుంటాయి తప్ప.. ఆరోగ్య ప్రమాణాలు 'పర్యావరణం' పరంగా మెరుగయ్యే అవకాశాలుండవు. ప్రపంచంలో ఏ దేశాన్ని చూసుకున్నాసరే, అక్కడి ప్రముఖ నగరాలు కాలుష్యంతో కునారిల్లడమే కన్పిస్తుంది. ఓ చోట చాలా ఎక్కువగా.. ఇంకో చోట కాస్త తక్కువగా.. తేడా అంతే. అంతకు మించి, ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధ వాతావరణం ఎక్కడా కన్పించదు. అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసానికి 'కాంపెన్సేషన్‌' అన్నట్లు, కొంత మేర పచ్చదనాన్ని పెంచడం ద్వారా.. నష్టాన్ని తగ్గించడం మాత్రమే చేయగలం.

Image result for chandrababu naidu

వాస్తవాలు ఇలావుంటే.. చంద్రబాబు మాత్రం, అమరావతిని 'ఆరోగ్యవంతమైన' నగరం అంటున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించాక.. అక్కడి పర్యావరణ పరిస్థితులకీ, ఇప్పటి పర్యావరణ పరిస్థితులకీ లెక్కలేస్తే.. చంద్రబాబు మాటల్లో ఎంత నిజముందో ఇట్టే అర్థమవుతుంది. కృష్ణానది ఒడ్డున.. అదీ నదీ గర్భంలోకి అన్నట్టుగా చంద్రబాబు అధికారిక నివాసం వుంది. ఇదే పర్యావరణ ప్రేమికుడి చిత్తశుద్ధి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, చంద్రబాబు విదేశాలకు వెళ్ళి పర్యావరణ పాఠాలు చెబుతుండడం హాస్యాస్పదంకాక మరేమిటి..!


మరింత సమాచారం తెలుసుకోండి: