2014 ఎన్నికలలో గెలవాలని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి కొద్దికాలంలోనే ప్రజా వ్యతిరేకత ఎదురైంది. అయినా కాని చంద్రబాబు ఇప్పటివరకు తనపై ఎటువంటి వ్యతిరేకత లేదు అన్నట్టుగా వ్యవహరించడానికి గల ప్రధానమైన కారణం ఎల్లో మీడియా. తాజాగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియా బరితెగించి మరీ ప్రత్యర్థుల పార్టీల పై ఆ పార్టీల అధ్యక్షుల పై ఇష్టం వచ్చినట్లు కథనాలు సృష్టిస్తోంది.
Related image
తాజాగా ఇటీవల జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర పై తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మీడియా ఛానల్ జగన్ పాదయాత్రకు ప్రజాస్పందన లేదంటూ ప్రచురించారు ఆ సదరు చానల్ లో...మరోపక్క యధావిధిగా చంద్రబాబు భజన చేస్తున్నారు.
Image result for chandrababu
ఇదిలావుండగా తాజాగా ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ విడాకుల విషయంలో సోషల్ మీడియాలో ఓ ప్రముఖ యాంకర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపిన విషయాలను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక న్యూస్ పేపర్ ప్రధానంగా ముందు పేజీలో ప్రచురించడంతో ఆ సదరు న్యూస్ పేపర్ పై మండిపడుతున్నారు నెటిజన్లు.
Image result for chandrababu
వ్యక్తుల వ్యక్తిగత విషయాలను ఇలా తమ రాజకీయ లబ్ది కోసం జర్నలిజాన్ని తప్పుదారి పట్టించడానికి చంద్రబాబు చేస్తున్న కుయుక్తులను ఎండగడుతున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. మీడియాని అడ్డం పెట్టుకుని ఇంతవరకు రాజకీయాల్లో రాణించిన చంద్రబాబు..రాబోయే రోజుల్లో సోషల్ మీడియా దెబ్బ కి చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు కనుమరుగైపోతుందని అంటున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: