దేశం లో జమిలి ఎన్నికలు గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇప్పటికే లా కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జమిలి ఎన్నికలకు సై అన్నాడు. అలాగే వైసీపీ పార్టీ కూడా ఓకె అన్నది. అయితే అందరిదీ  ఒక దారి అయితే నాదొక దారి అన్నట్టు టీడీపీ వ్యవహరిస్తుంది. జమిలి ఎన్నికలు కు ఒప్పుకోవడం లేదు. బీజేపీ లో కలిసి ఉన్నప్పుడూ ఓకె అని ఇప్పడూ మాత్రం వెనకడుగు వేయడం టీడీపీ కి దెబ్బె  అని చెప్పొచ్చు. 

Image result for chandrababu naidu

ఏడాది కిందట జమిలికి జై కొట్టిన చంద్రబాబు తాజాగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. కావాలంటే కేంద్రం ముందస్తుకు రావచ్చు.. మేం మాత్రం రాం. మా పదవీకాలం పూర్తయ్యాక జమిలి ఎన్నిక పెడితే అభ్యంతరం లేదు... అంటూ రకరకాలు అర్థం పర్థం లేని అనుమానాలను లేవదీస్తూ ఆయన జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే ముందస్తుకు కూడా సిద్ధమే అంటూ తెలంగాణలో పాలనలో ఉన్న తెరాస జమిలికి అనుకూల ఓటు వేసింది.

Image result for chandrababu naidu

మంగళవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్  కూడా ఎన్నికల ఖర్చు తగ్గితే దేశానికి మంచిదే గనుక... జమిలి తాము అనుకూలం అంటూ అభిప్రాయం చెప్పేసింది. ఇక పోతే.. జాతీయ పార్టీలు జమిలికే మొగ్గుతాయి గనుక.. కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. భాజపా ఎటూ వారి పక్షమే. ఈ రెండు రాష్ట్రాల్లో ఇంకా బొడ్డూడని పార్టీ అయిన జనసేన అభిప్రాయాన్ని ఈ విషయంలో అడుగుతారో లేదో తెలియదు. ఒకవేళ అడిగితే గనుక.. ‘జమిలికి  జై’ అంటూ పెద్దపెట్టున నినదించడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగానే ఉంటారని అనుకోవచ్చు. ఇక మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విషయంలో చంద్రబాబునాయుడు ఒక్కరే ఒంటరిగా మిగిలిపోయినట్లు కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: