శ్రీ‌కాకుళం జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. ఇద్ద‌రు కీల‌క నేత‌లు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ప‌క్క‌చూపులు చూస్తుండ‌డంతో ఎవ‌రికి లాభిస్తుంద‌నేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వారిద్ద‌రు మ‌రెవ‌రో కాదు.. ఒక‌రేమో కాంగ్రెస్ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మ‌రొక‌రేమో కాంగ్రెస్ నేత‌, రాష్ట్ర మాజీ మంత్రి కోండ్రు ముర‌ళీమోహ‌న్‌. ఇప్పుడు వీరిద్ద‌రూ పార్టీ వీడుతార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఇదే స‌మ‌యంలో వీరిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు కూడా రంగంలోకి దిగారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగిపుంజుకుంటుంద‌నీ.. అంద‌రికీ మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని పెద్ద‌లు బుజ్జ‌గించే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ఈనెల 16 పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి ఉమెన్‌చాందీ జిల్లాకు రానున్నారు. 


ఉమ్మ‌డి రాష్ట్రంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మంత్రివ‌ర్గంలో కోండ్రు ముర‌ళి వైద్యారోగ్య శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2004లో ఎచ్చెర్ల, 2009లో రాజాం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఆయ‌న‌ గెలుపొందారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ త‌రుపున‌ రాజాం స్థానం నుంచి బ‌రిలోకి దిగి ఓట‌మిపాల‌య్యారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు కాంగ్రెస్ కార‌ణ‌మైంద‌న్న కోపంలో ప్ర‌జ‌లు తీవ్ర‌స్థాయిలో తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే. అయితే, ప‌లువురు నేత‌ల త‌మ‌దారి తాము చూసుకున్నా.. ముర‌ళి మాత్రం పార్టీలోనే కొన‌సాగుతున్నారు. అయితే.. గ‌తంలో పోల్చితే.. అంత చురుగ్గా ఉండ‌డం లేదు. మ‌ళ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆయ‌న టీడీపీవైపు మొగ్గుచూపుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.  

Image result for killi kruparani

మొద‌ట‌ టీడీపీ, వైసీపీ ఈ రెండు పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం వైసీపీ తరఫున రాజాం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉండడంతో తనకు టికెట్  రాదనీ, టీడీపీలో చేర‌డ‌మే క‌రెక్టు అని ముర‌ళి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్క‌డ కూడా ముర‌ళి సానుకూల ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఆయన రాకను టీడీపీలోని ఒక వర్గం గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే స‌మ‌యంలో రాజాం నుంచి మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి తనకు లేదా తన కుమార్తెకు టిక్కె ట్ త‌చ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ గంద‌ర‌గోళం ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 


ఇక కేంద్ర‌మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాత్రం వైసీపీవైపు చూస్తున్నారు. టెక్కెలి ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గం. 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి బ‌రిలోకి దిగారు. 2004లో, 2014లో  ఓటమి చెందగా 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో ఐటీ, కమ్యునికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంద‌రిలాగే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కూడా ఓడిపోయారు. ఆమె ఇప్పటి వరకు ఆ పార్టీలోనే కొనసాగుతున్నా.. అంత చురుగ్గా ఉండ‌డం లేదు.  ఈక్ర‌మంలోనే ఆమె వైసీపీలోకి చేరేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అది కూడా టెక్కెలి అసెంబ్లీ నుంచి మాత్ర‌మేన‌ని తెలుస్తోంది.


ఎంపీగా బ‌రిలోకి దిగితే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు భరించాల్సి ఉంటుంద‌ని ఆమె భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే , టెక్కలి తన సొంత అసెంబ్లీ నియోజకవ ర్గం కావడంతోపాటు తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అక్కడ ఎక్కువ ఉండడంతో గెలుపు సులువవుతుందని భావిస్తున్నారు. అయితే.. కిల్లి కృపారాణి పెట్టిన ఈ కండిష‌న్‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ ఒప్పుకుంటారా..?  లేదా..? అన్నది ఇప్పుడు పార్టీవ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు మాత్రం ఎలాగైనా మ‌ళ్లీ ఆమెను ఎంపీగా బ‌రిలోకి దింపాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: