ఏమాట‌కామాట చెప్పుకోవాలి! జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తెలిసి మాట్టాడినా.. తెలియ‌క మాట్లాడినా.. కొన్నిసార్లు నిజాలు మాత్రం ఆయ‌న నోటి నుంచి త‌న్నుకుని వ‌స్తున్నాయి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పిన‌వ‌న్నీ బూట‌క‌మ‌ని ఆయ‌న అన్యాప‌గా.. అంగీక‌రిస్తూనే ఉన్నారు. బాబు మంచి వాడు.. ఉత్త‌మ పాల‌కుడు, ఆయ‌న‌లోని నీతి, నిజాయితీ త‌న‌కు న‌చ్చింది. ఆయ‌న‌లాంటి నేత దేశంలోనే లేడు. సో.. మీరంతా ఓట్లేయండి.. అని ప‌వ‌న్ చెప్పుకొచ్చాడు. ప‌నిగ‌ట్టుకుని షూటింగులు మానుకుని(దానితాలూకా డ‌బ్బును టీడీపీ అధినేత భ‌ర్తీ చేశార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది) మ‌రీ టీడీపీ ప్ర‌చార స‌భ‌ల‌కు వ‌చ్చారు. ప్ర‌చారం చేశారు. అధికారంలోకి తెచ్చారు. తాను సొంత పార్టీ పెట్టికూడా బాబుకు మ‌ద్ద‌తిస్తున్నానంటే.. అంటూ కొంత సెంటిమెంటును కూడా క‌ల‌గ‌లిపారు. 

Image result for pawan kalyan chandrababu

సీన్ క‌ట్ చేస్తే.. ప‌వ‌న్ సాయంతో గ‌ద్దెనెక్కిన చంద్ర‌బాబు పాల‌న‌.. ఇప్పుడు నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. మ‌రో ప‌దిమాసా ల్లో మ‌ళ్లీ ఎన్నిక‌లున్నాయి. ఇప్ప‌టికి కానీ, చంద్ర‌బాబు ఆయ‌న పాల‌న గురించి ప‌వ‌న్‌కు అర్ధం కాలేద‌ట‌! ఈ నేప‌థ్యంలో నే ఇటీవ‌ల ఆయ‌న తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రంలో దోపిడీ పాల‌న సాగుతోందంటూ.. క‌మ్యూనిస్టుల ప‌ద‌జాలాన్ని ప్ర‌యోగిస్తూ.. మైకులు అద‌ర‌గొట్టేస్తున్నారు. బాబు ఆయ‌న టీం రాష్ట్రాన్ని దోచేస్తోంద‌ని చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో చిన్న‌బాబు, మంత్రి లోకేష్‌పై కూడా ప‌వ‌న్ విమ‌ర్శ‌లు సంధించారు. 

Image result for pawan kalyan

చిన్న‌బాబుకు ద‌మ్ము ధైర్యం ఉంటే.. రాజీనామా చేసి రావాల‌ని స‌వాళ్లు సైతం రువ్వుతున్నారు. ఆయ‌న వార‌స‌త్వంగా వ‌చ్చిన ప‌ద‌విని అడ్డు పెట్టుకుని కులుకుతున్నార‌ని అన్నారు. మొత్తంగా ప‌వ‌న్‌లోని మ‌రోకోణం.. క‌మ్యూనిస్టుల‌తో క‌లిసాక బాగా ఎలివేట్ అయింద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఏదేమైనా రాష్ట్రంలో జ‌రుగుతున్న అనేక విష‌యాల‌పై ప‌వ‌న్ బాగానే స్పందిస్తున్నారు. అయితే, ఆయ‌న ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. తాను అన్నీ అధ్యయనం చేసే రాజకీయాల్లోకి వచ్చానని, చంద్రబాబు, లోకేశ్‌, జగన్‌ అనుచరులతో ఎక్కడికైనా వస్తే... తానొక్కడినే వచ్చి ఏ పాలసీపైనైనా డిబేట్‌లో కూర్చుందామని, అప్పుడు ఎవరి పరిజ్ఞానం ఏంటో తెలుస్తుందని పవన్‌ సవాల్‌ విసిరారు. 


కానీ, ఇక్కడ ప‌వ‌న్ ఎవ‌రిని టార్గెట్ చేయ‌బోయి.. ఎవ‌రిని విమ‌ర్శించారో ఆయ‌న‌కైనా తెలిస్తే మంచిదే అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి ప‌వ‌న్ చెప్పిన‌ట్టు.. చంద్ర‌బాబు.. జ‌గ‌న్‌లు.. దొడ్డిదారిన రాజ‌కీయాలు చేయ‌డం లేదు. వారు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో నెగ్గి అసెంబ్లీలో కాలుపెట్టారు. కేవ‌లం లోకేష్ మాత్ర‌మే మండ‌లికి ఎన్నికై మంత్రిగా చలాయిస్తున్నారు. మ‌రి ఇంకా ప‌వ‌న్ రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: