అనుభవంలో ఆయన కన్నా ఈయనే ఎక్కువ. కానీ పాలనలో మాత్రం ఆయన జెట్ స్పీడ్ తో పోతూంటే ఈయన అనుసరిస్తున్నారు. ఆయన కేసీయార్ అయితే ఈయన చంద్రబాబు. అటువంటి చంద్రబాబు తన కంటే జూనియర్ అయిన కేసీయర్ ని ఫాలో అవుతున్నారు. రెండేళ్ళ క్రితం తెలంగాణాలో కేసీయార్ పేదల కోసం క్యాంటీన్లు ప్రారభించారు. దాని బాబు ఏపీలో ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. అంటే కేసీయార్ ని  మక్కీకి మక్కీ అనుసరించడమే కదా


అక్కడ సక్సెస్ :


తెలంగాణాలో పేదల క్యాంటీన్లు ఫుల్ సక్సెస్. మాంచి జనాదరణతో సూపర్ గా నడుస్తున్నాయి. మాట ఇవ్వకుండానే కేసీయార్ ఈ పధకాన్ని ప్రారంభించారు, మన్ననలు అందుకున్నారు. అదే ఏపీలో అయితే గత రెండేళ్ళుగా అన్న క్యాంటీన్లంటూ బాబు తారకమంత్రం జపిస్తున్నారు. తమిళనాడులో ఎలా అమలు చేస్తున్నారో మంత్రులు చూసొచ్చారు కూడా. ఎట్టకేలకు ఈ రోజున అదీ మొదటి దఫాగా ఓపెన్ చేశారు.


ఎలక్షన్ స్టంట్


అన్న క్యాంటీన్లు ఫక్త్ ఎన్నికల స్టంట్ అంటున్నారు. ఇన్నాళ్ళూ ఊరించి దగ్గరలో ఎన్నికలు ఉన్నాయని చూసి మరీ పెట్టిన స్కీం అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ క్యాంటీన్ల పేరిట ఎక్కడ చూసినా టీడీపీ నాయకులే హల్ చల్ చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా పొలిటికల్ స్కీం అన్నది తెలిసిపోతోంది.   మరి ఈ స్కీం ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. అంతే కాదు. బాబు కోరుకుంటున్నట్లుగా ఎన్ని ఓట్లను పండిస్తుందో కూడా చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: