Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Jul 23, 2018 | Last Updated 1:18 am IST

Menu &Sections

Search

కత్తి బహిష్కరణపై మంద కృష్ణ మాదిగ ఫైర్!

కత్తి బహిష్కరణపై మంద కృష్ణ మాదిగ ఫైర్!
కత్తి బహిష్కరణపై మంద కృష్ణ మాదిగ ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని  ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన  ఇతరులను నగర బహిష్కరణ శిక్ష ఎందుకు  విధించలేదని ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ నేత , ఎమ్మార్పీఎస్  నేత మందకృష్ణ మాదిగ  ప్రశ్నించారు. కేవలం దళితుడు అయినందుకే కత్తి మహేష్ కు నగర బహిష్కరణ విధించారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.
telangana-mrps-leader-mandha-krishna-madiga-reacts
కత్తి మహేష్ విషయంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నగర బహిష్కరణలా లేదని, కుల బహిష్కరణలా ఉందని విమర్శించారు.   షీర్డీ సాయిబాబా భక్తులను కించపర్చేలా స్వామి పరిపూర్ణానంద మాట్లాడిన విషయాలను ఆయన ప్రస్తావించారు.   మరోవైపు  మథర్ థెరిస్సాను కూడ కించపర్చేలా స్వామి పరిపూర్ణానంద  ప్రకటనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అగ్రవర్ణాలకు చెందిన వారు చేసినప్పుడు మాత్రం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
telangana-mrps-leader-mandha-krishna-madiga-reacts

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిత్యం ఇతరుల మనోభావాలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని... ఆయనపై నగర బహిష్కరణ ఎందుకు విధించలేదని ప్రశ్నించారు. రంగనాయకమ్మ రామాయణాన్ని విమర్శిస్తూ పుస్తకాలు రాసినవారిని ఎందుకు బహిష్కరించలేదని అన్నారు. దళితుడైనందునే  కత్తిమహేష్‌కు ఇవన్నీ వర్తించాయని మందకృష్ణ అభిప్రాయపడ్డారు.  ఇతరులకో న్యాయం, దళితులకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. దళితులు  ప్రజాస్వామ్య పద్దతిలో  నిరసన తెలిపినా నేరమే అవుతోందన్నారు.  కనీసం మాట్లాడినా కూడ  నేరంగా చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.  కత్తి మహేష్‌పై  విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.



telangana-mrps-leader-mandha-krishna-madiga-reacts
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘ధడక్’సినిమాకు జాహ్నవి పారితోషికం ఎంతో తెలుసా!
సమంత ‘యూటర్న్’ ఫస్ట్ లుక్!
అప్పట్లో ఐదు వేలు ఇచ్చి ఆదుకున్నారు : రాంచరణ్
వెరైటీ కామెడీతో..'మై డియర్ మార్తాండం' టీజర్ రిలీజ్!
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు : కాజల్
నెటిజన్లకు వాట్సాప్ షాక్!
విజయ్ కూడా ఆ ప్రయోగం చేస్తున్నాడా!
శ్రీరెడ్డిపై తమిళ హీరో ఫైర్!
సరదా సరదాగా సాగే ప్రయాణం..మొదలైంది!
హర్యానా మరో దారుణం..మహిళపై 40 అత్యాచారం!
మెగా ఫ్యాన్స్ కి శుభవార్త.. చిరు పుట్టిన రోజు నాడు ఢబుల్ ధమాకా!
పవన్‌పై మరోసారి శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!
మెగా చెల్లెలి కోసం అన్నయ్య!
అసలు వాస్తవాలతో.. సంజు బయోపిక్ మళ్ళీ తీస్తా...వర్మ సంచలన ప్రకటన..!
'ఆర్ ఎక్స్ 100' అదే జోరు..కలెక్షన్ల హోరు!
అఖిరా హైట్ చూస్తే..నిజంగా షాక్!
మహేష్ కొడుకు గౌతము లుక్ చూస్తే షాక్!
బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసిన ఆర్ ఎక్స్ 100
బిగ్ బాస్ 2 లోకి యాంకర్ ప్రదీప్ ఎంట్రీ?!
అమితాబ్‌ యాడ్‌పై బ్యాంకర్ల సీరియస్!
‘అర్జున్ రెడ్డి’కి విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?!
టీవి నటి ఆత్మహత్య!
పార్లమెంటు వర్షాలకాల సమావేశాలు ప్రారంభం!
అలాంటి వారిని చెప్పుతో కొడతా : మంచు లక్ష్మి
 నన్ను కావాలనే ఇరికించారు! : జబర్దస్త్ నటుడు