విభజన ఆంధ్ర ప్రదేశ్ లో రంజైన రాజకీయం సాగుతోంది. నిన్నటి వరకూ రెండే పార్టీలు అనుకున్నది కాస్తా పవన్ రాకతో మూడు ముక్కలాటగా పాలిట్రిక్స్ మారిపోయింది. ఓ వైపు అధికారం చేతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ విపరీతమైన ప్రచారంతో దూసుకుపోతూండగా, మరో వైపు చావో రేవో అన్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గోదాలోకి దిగేసింది. ఆ పార్టీ అధినేత జగన్ వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాద యాత్రను చేస్తూ జనంతో మమైకమవుతున్నారు. ఇంకోవైపు పవన్ సైతం ఈ మధ్య కాలంలో బాగా యాక్టివ్ అయిపోయారు. రెండు విడతలుగా దాదాపు యాభై రోజుల పాటు ఆయన ఉత్తరాంధ జిల్లాలలో ప్రజా పోరాట యాత్రను నిర్వహించారు.  దీంతో ఏపీ పాలిటిక్స్ మూడే మారిపోయింది.


బ్రేకులేస్తున్న టీడీపీ :


ఓ వైపు అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. నాలుగేళ్ళుగా అధికారంలో ఉన్నా కూడా చెప్పుకోదగిన కార్యక్రమం ఏదీ చేయకపోవడం వల్ల టీడీపీకి డేంజర్ బెల్స్ కొడుతున్నాయి. అయితే పవర్ ని అడ్డం పెట్టుకుని యాంటి ఇంకంబెన్సీకి బ్రేకులేసేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. అన్ని వైపుల నుంచి టీడీపీనే గురి పెడుతున్నా ఓ స్ట్రాటజీ ప్రకారం బాబు జనంలోకి వెళ్తున్నారు. పాత హామీల చిట్టాను అటక మీద నుంచి దింపి మరీ వీలున్నన్ని వాటిని నెరవేర్చే పనిలో పడ్డారు. నిరుద్యోగ భ్రుతితో పాటు, అంగన్ వాడీలకు జీతల పెంపు, ఉద్యోగ వర్గాలకు భారీ ప్రయోజనాలు, వివిధ సామాజిక వర్గాలకు తాయిలాలు ఇలా బాబు మార్క్ పాలిట్రిక్స్ కి తెర తీశారు.
క్యాబినెట్లో మైనారిటీ ఒకరిని తీసుకోవడం ద్వారా ఆ ఓటు బ్యాంక్ ని మొత్తం పట్టేయాలని బాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. బీజేపీతో కటీఫ్ తరువాత ఆయా వర్గాలలో పలుకుబడి పెరిగిందని బాబు అనుకుంటున్నారు. ఓ వైపు కేంద్రంతో పోరాటం అంటూ బిల్డప్ ఇస్తూనే మరో వైపు ఏపీలో బీజేపీకి చేయాల్సినంత  రాజకీయ నష్టం చేసేశారు. ఇపుడెవరూ ఆ పార్టీని కనీసం టచ్ చేయనంతగా బదనాం చేశారు. ఇది చాలదన్నట్లు బీజేపీతో వైసీపె పొత్తు అంటూ కొత్త ఎత్తు వేసి మరీ ఆ పార్టీలను దెబ్బ తీసేందుకు రెడీ అయిపోయారు. ఇపుడున్న పరిస్థితులలో టీడీపీ వీలైనంత మేర జనాగ్రహాన్ని తగ్గించుకోవడానికే ఇంపార్టంట్ ఇస్తోంది. 


పాదయాత్రతో భారీ మైలేజ్


జగన్ ప్రాణాలకు తెగించి చేస్తున్న వేల కిలోమీటర్ల పాదయాత్ర ఆ పార్టీకి భారీ మైలేజ్ సంపాదించి పెట్టిందన్నది వాస్తవం. ముఖ్యంగా పోయిన సారి ఎన్నికలలో  పోగొట్టుకున్న జిల్లాలను ఈసారి ఒడిసి పట్టుకోవాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు బాగానే సక్సెస్ అయినట్లుగా ఆయన సభలకు వస్తున్న జనం చెబుతున్నారు. గుంటూర్, క్రిష్ణ, ఉభయ గోదావరి జిల్లాలలో జగన్ పార్టీ ఈసారి పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. స్నంటిమెంట్ జిల్లాలుగా పేరున్న గోదావరి జిల్లాలలో ఈసారి గాలి బాగా మారుతున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ఏపీ రాజకీయాలలో భారీ మార్పు తప్పదు.


చీల్చే ఒట్లు ఎవరివి ? :


మూడవ పార్టీగా వస్తున్న జనసేన గెలుపు మాట అటుంచి ఓట్ల చీలికను బాగా రాజేసే అవకాశాలు ఉన్నాయి. గతసారి బాబు తెలివిగా పవన్ ని తన వైపుకు తిప్పుకుని ఓట్ల చీలికను అడ్డుకున్నారు. అంటే దాని అర్ధం పవన్ ఓట్లు టీడీపీవేననే కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అది నిజం కూడా. ఉభయ  గోదావరి జిల్లాలలో వచ్చిన ఫలితాలు చూస్తే వన్ సైడ్ గా ఓటింగ్ జరిగింది. అందుకు పవన్ కారణమన్నది ఒప్పుకుని తీరాలి. మరి పవన్ ఈసారి సొంత కుంపటి పెట్టేశారు. ఆయన ఓట్లు ఆయన తెచ్చుకున్నా టీడీపీ ఓడిపోతుంది. లేక వైసీపీకి   ఆ కాపు ఓట్లు మళ్ళినా కూడా పరాజయం తప్పదు. సో పవన్ ప్రభావం ఉత్తర కోస్తాను దాటకపోతే టీడీపీ బాగా దెబ్బ తింటుంది. ఏ విధంగా చూసిన ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందన్నది నిజం. పవన్ మాత్రం ఒకరిని గెలిపించి మరొకరికి షాక్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాడన్నదీ  నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: