ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద జరిగిన మీడియా దాడి అందరికీ తెలిసిందే. ముఖ్యముగా కొన్ని ఛానల్స్ అదే పనిగా పనికమాలిన డిబేట్స్ పెట్టి అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలను ప్రసారం చేయించారు. దీనితో అప్పుడు మెగా ఫామిలీ మొత్తం రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే జనసేన ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ కు మీడియా ఛానల్ తప్పక అవసరం అయ్యింది. 

Image result for janasena

జనసేన పార్టీ ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో.. ఆ పార్టీ కీలక నాయకుడు ఒక టీవీ ఛానెల్ ను సొంతం చేసుకున్నారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న 99 టీవీ ఛానెల్ ను తోటచంద్రశేఖర్ కొనుగోలు చేశారు. మొత్తానికి పవన్ కల్యాణ్ రాజకీయాలను చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారనడానికి.. అమీ తుమీ తేల్చుకునేలా.. తన మార్కు ప్రచారానికి కత్తెరలు లేకుండా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నారనడానికి ఇది నిదర్శనం.

Related image

సీపీఎం 10 టీవీ పెట్టుకోగానే.. మనకు  కూడా ఓ టీవీ వ్యాపారం ఉండాలని అనుకున్నదేమో గానీ.. సీపీఐ కూడా 99 టీవీని ప్రారంభించింది. ఇప్పుడు వారు దానిని విక్రయించేయగానే.. వీరు కూడా దీనిని విక్రయించేశారు. మొత్తానికి తమ పార్టీకి కూడా ఒక టీవీ ఛానెల్ ప్రచారం అవసరం అని భావిస్తున్న జనసేన కోసం.. తోట చంద్రశేఖర్ దానిని కొనుగోలు చేశారు.సివిల్ సర్వీసెస్ కేడర్ కు చెందిన తోట చంద్రశేఖర్ ముంబాయి నగరాభివృద్ధి సంస్థ సీఈవో గా పనిచేసి పాపులారిటీ సంపాదించుకున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు.. తోట చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా పోటీచేశారు. భారీగా ప్రచారం నిర్వహించారు గానీ.. రాయపాటి సాంబశివరావు తదితరుల ముందు నిలవలేకపోయారు. చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత.. ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు నుంచి ఎంపీగా రంగంలోకి దిగారు గానీ.. ఆ ఆశ కూడా ఫలించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: