టీడీపీ లో లోకేష్ నెంబర్ 2 అన్న సంగతీ తెలిసిందే. అయితే టీడీపీ లో చంద్ర  నాయుడు ని మించిన రాజకీయ నాయకులూ ఉన్నారు. చంద్ర బాబు లోకేష్ ను ఎక్సపోజ్ చేసే క్రమంలో సీనియర్ నాయకులను నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్త గా వ్యవహరించాడు. అయితే చంద్ర బాబు కు ఉన్న తెలివి తేటలు లోకేష్ కు ఉండాలి కదా..! కొంచెం తొందర పడి మొత్తానికి మోసం తెచ్చాడు.

Image result for lokesh and tg venkatesh

ఓ ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన లోకేష్.. ఎస్వీ మోహన్ రెడ్డికే అంతా ఓట్లు వేసి గెలిపించాలంటూ పిలుపునివ్వడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీనిపై స్థానిక ఎంపీ టీజీ వెంకటేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అలా ఏకపక్షంగా అభ్యర్థి పేరును ప్రకటించడం ఏమాత్రం బాగాలేదంటున్నారు టీజీ. లోకేష్ గారు ఓ మంత్రి. వచ్చింది ప్రభుత్వ కార్యక్రమానికి. ఆయన టీడీపీ ప్రతినిధి కాదు. ముఖ్యమంత్రి అంతకంటే కాదు. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చి ఎమ్మెల్యే, ఎంపీలుగా వ్యక్తుల పేర్లను ఎనౌన్స్ చేయడం నిజంగా నాకు అంతుబట్టడం లేదు.

Image result for lokesh and tg venkatesh

ఓవైపు లోకేష్ వ్యవహార శైలిని తప్పుబడుతూనే, మరోవైపు టీడీపీపై తనదైన స్టయిల్ లో పరోక్షంగా విమర్శలు గుప్పించారు టీజీ వెంకటేష్. తెలుగుదేశంలో నిర్ణయాలన్నీ అర్థరాత్రి తీసుకుంటారంటూ టీజీ వెంకటేష్ సీరియస్ గా చెప్పడం అందరికీ నవ్వు పుట్టించింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా అర్థరాత్రి నిర్ణయాలు తీసుకుంటుంది. పొద్దున్న బి-ఫారం ఇస్తుంది. మరి లోకేష్ ఎందుకు అలా స్పందించారో తెలీదు. మోహన్ రెడ్డి ఏమైనా హిప్నటిజం చేశారేమో. ఏమో చెప్పలేం, మా మోహన్ రెడ్డి ఏమైనా చేయగలడు. ఇలా లోకేష్ పై, టీడీపీపై పరోక్షంగా విమర్శలు ఎక్కుబెట్టారు టీజీ.


మరింత సమాచారం తెలుసుకోండి: