లేట్ గా వచ్చినా లేటెస్ట్ డెసిషన్లతో జనసేన దూకుడు మీదుంది. విశాఖకు సంబంధించి ఆ పార్టీ ఎంపీ క్యాండిడేట్ డిసైడ్ అయినట్లే. ఈ మధ్యనే ఆ పార్టీలో చేరిన బొలిశెట్టి సత్యనారాయణను ఎంపీ బరిలోకి దింపడం ష్యూర్ అంటున్నారు. విశాఖలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన బొలిశెట్టి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.  టీడీపీ, వైసీపీ కమ్మ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం ఉంది. దాంతొ కాపుల ఓట్లు కొల్లగొట్టేందుకు బొలిశెట్టిని దింపారంటున్నారు.


అదే కారణం :


పర్యావరణవేత్తగా అమరావతి రాజధాని భూముల విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి పోరాడుతున్న బొలిశెట్టి సామాజిక ఉధ్యమ నాయకునిగా గుర్తింపు ఉంది. జనంలో కొంత పేరున్న లీడర్ గా ఆయనను ఎంపీ అభ్యర్ధిగా పెడితే అర్ధ బలం, అంగబలం కూడా సమకూరుతాయని అంచనా వేస్తున్నారు. బొలిశెట్టి కాంగ్రెస్ కావడంతో ఆయనతో పాటే మరింతమందిని కూడా జనసేనలో అపుడే చేర్పించేశారు. 


గంటాపై ఫైర్ :


పార్టీలో ఇలా చేరారో లేదో బొలిశెట్టి మంత్రి గంటాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నీ ఆస్తులు చెప్పు, నీ వ్యాపారాలూ చెప్పు, విశాఖ గ్రంధాలయం మాయం కావడానికి కారణాలూ చెప్పు, విద్యా సంస్థలలో అవినీతి పెచ్చుమీరడానికి ఎవరు కారణమో కూడా చెప్పు అంటూ మంత్రికి ప్రశ్నలను సంధించేశారు. .రానున్న రోజులలో రాజకీయంగా జనసేన తరఫున బొలిశెట్టి మంత్రికి మరిన్ని షాకులు ఇస్తాడంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: