వైసీపీలో పెద్ద తలకాయలకు జగన్ షాక్ ఇవ్వనున్నారా. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరున పాలిట్రిక్స్ ప్లే చెయనున్నారా. అంటే జవాబు అవుననే వస్తోంది. వచ్చే ఎన్నికలలో వైసీపీ కి పవర్ దక్కడం ఖాయమనుకుంటున్న జగన్ పార్టీలో  సీనియర్లను తనదైన స్టైల్ లో వాడుకోవాలనుకుంటున్నట్లు భోగట్టా. అదే టైంలో జూనియర్లను, యూత్ ని చేరదీయాలని ప్లాన్ చేస్తున్నారు.


వారంతా అటేనా :


ఉత్తరాంధ్రాలో పెద్ద తలకాయలుగా ఉన్న మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారిని ఈసారి డిల్లీ గడప తొక్కించాలని జగన్ బ్రహ్మాండమైన పధకం వేస్తున్నారు. తాను ముఖ్యమంత్రినైతే తన తండ్రి క్యాబినెట్లో పనిచేసిన సీనియర్లు పక్కన ఉంటే పాలనాపరంగానే కాకుండా రాజకీయంగానూ చిక్కులు వస్తాయన్న ముందు చూపుతోనే జగన్ వారిని పార్లమెంట్ కు పంపుతున్నారని టాక్.


డబుల్ బెనిఫిట్స్  :


ఇలా చేయడం వల్ల పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. సీనియర్లు పార్లమెంట్ కి పోటీ చేస్తే వారి అసెంబ్లీ సీట్లలో కూడా పార్టీ గెలుపు సులువు అవుతుందని, అన్ని విధాలుగా వారు తట్టుకుంటారని కూడా అధినేత ఆలోచిస్తున్నారట. అసెంబ్లీ సీట్లకు కొత్త వారిని, జూనియర్లను పెట్టుకుంతే పార్టీకి ఫ్రెష్ లుక్ రావడమే కాకుండా  జనంలోనూ సానుకూలత పెరుతుందని అంటున్నారు. సో. పెద్దలు ఇకపై డిల్లీ బాట పట్టాల్సిందేనట. ఎవరు ససేమిరా అన్న ఇదే ఫైనల్ అవుతుందని పార్టీ వర్గాల సమాచారం. పదేళ్ళు మంత్రులుగా పనిచేసి మరో మారు చక్రం తిప్పుదామనుకుంటున్న బొత్స, ధర్మాన వంటి వారికి ఇది నిజంగా చేదు వార్తే.


మరింత సమాచారం తెలుసుకోండి: