Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 9:32 am IST

Menu &Sections

Search

ఎడిటోరియ‌ల్ : టిడిపి ముందు ' గోబెల్స్' కూడా ప‌నికిరాడు

 ఎడిటోరియ‌ల్ : టిడిపి ముందు ' గోబెల్స్'  కూడా ప‌నికిరాడు
ఎడిటోరియ‌ల్ : టిడిపి ముందు ' గోబెల్స్' కూడా ప‌నికిరాడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విష‌యం  ఏదైనా స‌రే గోబెల్స్ ప్ర‌చారంలో తెలుగుదేశంపార్టీని  మించిన పార్టీ మ‌రోటి లేదు.  అందుకు కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో జరిగిన ప‌రిణామాలే తాజా ఉదాహ‌ర‌ణ‌.  ఎన్డీఏలో నుండి చంద్ర‌బాబునాయుడు బ‌య‌ట‌కు వ‌చ్చేసిన త‌ర్వాత పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌కు గ‌డ్క‌రీ రావ‌టం ఇదే తొలిసారి.  గ‌డ్క‌రీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైన ద‌గ్గ‌ర నుండి కేంద్ర‌మంత్రి ప‌ర్య‌ట‌న‌పై టిడిపి, బిజెపి నేత‌ల్లో  ఉత్కంఠ మొద‌లైంది.  ప్రాజెక్టు ప‌నుల‌పై గ‌డ్క‌రీ ఏ విధంగా స్పందిస్తారో అని అంద‌రూ ఎదురుచూశారు.

ఘాటుగా స్పందించిన గ‌డ్క‌రీ

polavaram-project-central-minister-nitin-gadkari-c

టిడిపి సంగతి ప‌క్క‌నపెడితే బిజెపి నేత‌లు అనుకున్న‌ట్లే కేంద్ర‌మంత్రి గ‌ట్టిగానే స్పందించారు.  అంద‌రూ టివిల్లో చూసిన ప్ర‌కార‌మైతే గ‌డ్క‌రీ ముఖ్య‌మంత్రి, ఉన్న‌తాధికారుల‌కు తలంటిపోశారు. ప్రాజెక్టు అంచ‌నాలు పెరిగిపోయిన విష‌య‌మై చంద్ర‌బాబును అంద‌రిముందు నిల‌దీశారు.   డిపిఆర్ -2 అంచ‌నా వ్య‌యం పెంచే విష‌యంలో కేంద్రమంత్రిత్వ శాఖ‌ల అనుమ‌తి తీసుకున్నారా అంటూ  సూటిగా ప్ర‌శ్నించారు. పున‌రావాస వ్య‌యం పెరిగిన విష‌యాన్ని ఒప్పుకుంటూనే  వేలాది ఎక‌రాల‌ను సేక‌రించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందంటూ నిల‌దీశారు. డిజైన్ల‌కు కేంద్రం అనుమ‌తిని తీసుకున్నారా అంటూ ప్ర‌శ్నించారు. అంచ‌నాల పెంపును రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఏ విధంగా స‌మ‌ర్ధించుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు.


స‌మాధానం చెప్ప‌లేక‌పోయిన చంద్ర‌బాబు

polavaram-project-central-minister-nitin-gadkari-c

ఇలా చాలా అంశాల‌పై త‌న అసంతృప్తిని నేరుగా చంద్ర‌బాబు  ముందే బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.  టివి న్యూస్ లో ఈ విష‌యాల‌న్నింటినీ అంద‌రూ చూసిందే. అయితే, జ‌రిగిన విష‌యం ఒక‌టైతే టిడిపి నేత‌లు మాత్రం ఉల్టాగా ప్ర‌చారం చేసుకుంటున్నారు.  ఎంపిలు రామ్మోహ‌న్ నాయుడు, కేశినేని నాని త‌దిత‌రులు ఈరోజు  మాట్లాడుతూ,  ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతున్న తీరుపై కేంద్ర‌మంత్రి కితాబిచ్చారంటూ చెప్పుకుంటున్నారు. ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నందుకు చంద్ర‌బాబుతో పాటు ఉన్న‌తాధికారుల‌ను అభినందించార‌ని మీడియాతో చెప్పారు. 


జ‌రిగిన‌దానికి భిన్నంగా టిడిపి ప్ర‌చారం

polavaram-project-central-minister-nitin-gadkari-c

గ‌డ్క‌రీ ప్రాజెక్టును సంద‌ర్శించిన‌ట్లే మిగిలిన కేంద్ర‌మంత్రులు కూడా వ‌చ్చి ప్రాజెక్టు ప‌నుల‌ను చూడాల‌ట‌. కేంద్ర‌మంత్రే స్వ‌యంగా ప్రాజెక్టు ప‌నుల‌ను మెచ్చుకుంటుంటే రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేయ‌టంలో అర్ధ‌మే లేదంటు మండిప‌డుతున్నారు.  ప్రాజెక్టుకు గ‌డ్క‌రీ కితాబిచ్చారు కాబ‌ట్టి ప్ర‌తిప‌క్షాలు ఇక నోరుమూసేసుకోవాల‌ని నాని అంటున్నారు. ప్రాజెక్టు సైట్ లో గ‌డ్క‌రీ అన్న‌మాట‌లేంటి ?  తాజాగా టిడిపి ఎంపిలు ప్ర‌చారం చేసుకుంటున్న‌దేంటి ? అంటే అక్క‌డ ఒక‌టి జ‌రిగితే టిడిపి ఎంపిలు ఉల్టాగా ప్ర‌చారం చేసుకోవ‌టాన్ని చూసిన వాళ్ళు టిడిపి ముందు గోబెల్స్ కూడా ఎందుకూ ప‌నికిరాడంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

బిజెపి ఫీడ్ బ్యాకే గ‌డ్క‌రీ డైలాగులు

polavaram-project-central-minister-nitin-gadkari-c

పోల‌వ‌రం ప్రాజెక్టులో భారీగా అవినీతి జ‌రుగుతోంద‌ని బిజెపి నేత‌లు ఎప్ప‌టి నుండో ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఎంఎల్సీ సోము వీర్రాజు లాంటి నేత‌లు త‌మ ఆరోప‌ణ‌ల‌కు ఉదాహ‌ర‌ణ‌లు కూడా చూపుతున్నారు. అవినీతి జ‌రిగింద‌నే విష‌యంలో వైసిపి, కాంగ్రెస్ నేత‌లు కూడా ఎన్నో ఆరోప‌ణ‌లు చేశారు. ఎవ‌రి వాద‌న ఎలాగున్నా బిజెపి నేత‌ల ఫీడ్ బ్యాక్ ప్ర‌కార‌మే గ‌డ్క‌రీ న‌డుచుకుంటార‌న్న విష‌యం తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్లే గ‌డ్క‌రీ కూడా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి గడ్క‌రీ మాట్లాడేట‌పుడు చంద్ర‌బాబు మొహం మాడిపోవ‌టం టివిల్లో అంద‌రూ స్ప‌ష్టంగా చూసిందే. వాస్త‌వాలిలా ఉంటే టిడిపి ఎంపిలు మాత్రం రివ‌ర్స్ లో ప్ర‌చారం చేసుకోవ‌టం విచిత్రంగా ఉంది. 


polavaram-project-central-minister-nitin-gadkari-c
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్ర‌బాబు : ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశం ఓ బూట‌క‌మేనా ?
చేతులెత్తేసిన హోం మంత్రి
నెల్లూరు జిల్లాలో వైసిపికి షాక్
జేసీ సోద‌రుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్ ను  బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
షోకాజ్ నోటీసు ఇచ్చే స్ధాయి కాంగ్రెస్ లో ఎవ‌రికుంది ?
చింత‌మ‌నేనిపై అట్రాసిటీ కేసు
చ‌ద‌ల‌వాడ జంప్...చంద్ర‌బాబుకు షాక్
వెంక‌టగిరి నియోజ‌క‌వ‌ర్గం ఆనంకేనా ?
చంద్ర‌బాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్
ఎడిటోరియ‌ల్ : చంద్ర‌బాబు-మోడి మ‌ధ్య లోపాయికారీ ఒప్పంద‌ముందా ?
ఎడిటోరియ‌ల్ : ఊస‌ర‌వెల్లి కూడా సిగ్గుప‌డాల్సిందే
రేవంత్ రెడ్డికి ప్ర‌మోష‌న్...అడిగిందొక‌టి..ఇచ్చిందొక‌టి
జ‌గ‌న్ @ 3000 కిలోమీట‌ర్లు
ఎడిటోరియ‌ల్ :  టిడిపి ఓటు బ్యాంకులో చీలిక‌లు..ప్ర‌త్యామ్నాయ‌మేంటి ?
కాంగ్రెస్ లో కెసియార్ కోవ‌ర్టులా ?
చంద్ర‌బాబుకే షాకిచ్చిన ఎంఎల్ఏలు
ఎడిటోరియ‌ల్ :  జ‌గ‌న్ ది అదిరిపోయే స్ట్రాట‌జీ..వ‌ర్క‌వుట‌వుతుందా ?
 ఎడిటోరియ‌ల్ : గోదావ‌రి పుష్క‌రాల ప్ర‌మాదంలో చంద్ర‌బాబు త‌ప్పేలేద‌ట‌...నివేదిక‌లో సంచ‌ల‌న విష‌యాలు
తోక‌ముడిచిన చంద్ర‌బాబు
దేవినేని క‌నుస‌న్న‌ల్లోనే ఇసుక అక్ర‌మ ర‌వాణా ?
అమ‌రావ‌తిలో ఫుల్లుగా దోచేశారు...క‌డిగేసిన కాగ్
ఎడిటోరియ‌ల్ :  ఇండియా టుడే స‌ర్వేతో జ‌గ‌న్ కు వార్నింగ్ బెల్సేనా ?
సెంట్ర‌ల్ టిక్కెట్టు రాధాకు లేన‌ట్లే
టిడిపి ఎంఎల్ఏకి చిక్కులు
20 వేల పోస్టుల భ‌ర్తీ..ఎందుకో తెలుసా ?
ఉద్యోగ జేఏసి ఆందోళ‌న‌...అమ‌రావ‌తిలో ఉద్రిక్త‌త
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.