జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో ఏ రోజుకు ఆ రోజు బ్రతుకుతున్న జీవితాలకు భవిష్యత్తులో బాగా బ్రతకగలం అనే ఆశ చిగురింపజేస్తోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమ అభిమానుల మధ్య ఆప్యాయతలతో ముందుకు సాగుతుంది..జగన్ అడుగుపెట్టిన ప్రతి చోట ప్రజలు తండోపతండాలుగా వచ్చి జగన్ చెబుతున్నమాటలను వింటూ జగన్ కి జై కొడుతున్నారు. ఈ గ్రామంలో చాలామంది ప్రజలు 2014 ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ఎలా మోసపోయారు అన్ని విషయాలను జగన్కి వివరిస్తున్నారు.

Related image

అయితే ఎన్నికల విషయంలో నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను అని... చెప్పిందే చేస్తాను అని జగన్ ముక్తకంఠంతో ప్రజలకు వివరణ ఇచ్చారు. గత ఎన్నికలలో నేను కూడా రైతు మాఫీ చేస్తాను అని అంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చే వాడిని...కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి నేను అటువంటి హామీలు ఇవ్వలేదని పేర్కొన్నారు.

Image result for jagan in auto driver dress

అయితే ఈసారి వచ్చే ఎన్నికలలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అబద్దాలు మోసాలు అమలు చేయలేని హామీలు గుప్పించే వారిపై వారి చేస్తున్న ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకసారి ఓటు సరిగ్గా ఉపయోగించకపోతే ఏ విధంగా విభజనకు గురై నష్టపోయిన రాష్ట్రం కష్టాల పల అయిందో మనం చూస్తున్నాం.. ఈసారి అటువంటి తప్పు జరగకూడదని పేర్కొన్నారు.

Related image

వచ్చే ఎన్నికల్లో భవిష్యత్ తరాలను ఆలోచనలో పెట్టుకుని...మీ మనస్సాక్షి ప్రకారం ఓటెయ్యండి అంటూ జగన్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా జగన్ పాదయాత్రలో ఇటీవల ఆటో డ్రైవర్లు జగన్ ని కలిసి తన బాధలు గురించి చెప్పగా... వైసీపీ అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు రూ10 వేలు ఇస్తామని జగన్‌ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: