చంద్రబాబు నాయుడు  విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కర్నూల్ అభ్యర్ధులను  లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీని మీద  కర్నూల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా టీజీ వెంకటేష్  రాజ్యసభ సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  డైరెక్టుగా లోకేష్ మీద విమర్శలు చేసినాడు. లోకేష్ పార్టీ ప్రెసిడెంట్ కాదు  అది ప్రభుత్వ కార్యక్రమం కాదు మరి అభ్యర్థుల ను ప్రకటించడానికి  లోకేష్ కు ఉన్న అధికారాలు ఏమిటి?  అని సూటిగా ప్రశ్నించారు. దీనితో కర్నూలు లో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కిపోయింది.

Image result for chandrababu

కర్నూలుజిల్లా తెలుగుదేశం రాజకీయాలు ఇప్పటికే రకరకాల చికాకుల్లో సతమతం అవుతున్నాయి. భూమ అఖిలప్రియ – ఏవీసుబ్బారెడ్డి వర్గాలు అక్కడ ఎన్ని వివాదాలకు కారణం అవుతున్నారో అందరికీ తెలిసిందే. ఆ జిల్లా పార్టీ విషయంలోనే చంద్రబాబు రెండు మూడుసార్లు జోక్యంచేసుకుని పంచాయతీలు చేయాల్సి వచ్చింది. అలాంటి జిల్లాలో చినబాబు లోకేష్ ఎంచక్కా మరో చిచ్చు రగిలించి వచ్చారు.

Image result for chandrababu

కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీమోహన్ రెడ్డిని గెలిపించాలంటూ.. అభ్యర్థిత్వాలను ప్రకటించేస్తున్నట్లుగా లోకేష్ చేసిన ప్రకంపనాలు రగిలించిన చిచ్చు ఇంకా చల్లారడంలేదు. టీజీ వెంకటేష్ ఒకవైపు వైకాపాతో సమాలోచనలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అభ్యర్థిత్వాల విషయంలో చంద్రబాబు నోటినుంచి మాట వచ్చిన తర్వాతే.. తన స్పందన ఏంటో చెబుతానంటూ టీజీ వెంకటేష్ పరోక్షంగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. టీజీ రచ్చకెక్కిన తీరుతో పార్టీ పరువు బజార్న పడినట్టే. ఇంకా చంద్ర బాబు స్పందించక పోవడం తో టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుందని అందరూ అభిప్రాయ పడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: