రాముడి కోసం లంకాదహనం చేసిన హనుమంతుడు గురించి అందరికీ  తెలిసిందే అయితే కత్తి మహేష్ హిందువులు ఆరాధ్య దేవుడిగా కొలిచే రాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకి శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద కి పట్టలేని కోపం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ప్రతీ హిందువు పరిపూర్ణా తలపెట్టిన తిరుగుబాటుకి మద్దతు తెలిపారు. కత్తి వ్యాఖ్యలకి నిరసనగా స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పూనుకున్నారు. శాంతి భద్రతల నేపధ్యంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి..గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదులకి గాను ఆయనకు నగర బహిష్కరణ  చేస్తున్నట్లుగా నోటీసులు ఇచ్చి ఆయన్ని హైదరాబాదు నుంచీ బహిష్కరించి బయటకి తరలించిన విషయం అందరికి తెలిసిందే

 Image result for paripurna swamy

అయితే కత్తి మహేష్ ని కూడా స్వామీజీ కంటే ముందుగానే నగరం నుంచీ బహిష్కరించారు.. హైదరాబాద్ లో శాంతి భద్రతలకి ఎట్టి పరిస్థితులలో భంగం కలగకూడదు అనే ఉద్దేశ్యంతోనే పోలీసులు ఈ విధంగా బహిష్కరణలు ఇద్దరిపై విధించారు అయితే ఈ విషయంలో తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా స్పందించారు..మత విద్వేషాలు లేకుండా శాంతి భద్రతలని కాపాడటానికి ఎలాంటి చర్యలు అయినా తీసుకోండి అంటూ పోలీసు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు...అంతా బాగానే ఉన్న తరుణంలో

 Image result for hyderabad police banned paripoornananda

మళ్ళీ హైదరాబాద్ వచ్చేందుకు సిద్దమయ్యారు స్వామీ పరిపూర్ణానంద...హైదరాబాదు నుంచీ ఆరునెలలు బహిష్కరణకి గురయ్యిన స్వామీజీ మళ్ళీ వస్తున్నారని వార్తలు తెలిసిన నేపధ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు.. మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆయన టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్నారు...అయితే స్వామీజీపై బష్కరణ విధించింది కేవలం హైదరాబాద్ పరిధి వరకే అందుకు గాను స్వామీజీ హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాలలో ఉండేందుకు గాను సమాయుత్తం అవడంతో  విషయం తెలుసుకున్న పోలీసులు అందుకు తగ్గట్టుగా స్పందించారు....వెంటనే సైబరాబాద్‌...రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోనూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాదు వాటిని పరిపూర్ణనంద స్వామీకి అందచేయడానికి కాకినాడ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: