అక్కడ ఉన్నదంతా మా సొత్తే,ఆ అస్తే అంటూ సత్తెకాలపు కాంగ్రెస్ పార్టీ గోడుమంటోంది. బయట పార్టీలలో ఉన్నోళ్ళంతా మా వాళ్ళే, మా రక్తమంటూ బాధపడుతోంది. అందర్నీ వెనక్కు రమ్మన్నాం, వస్తారన్న ఆశ ఉందంటోంది.  ఘర్ కీ వాపస్ అని కూడా  అంటోంది. ఇంతకీ ఏపీలో కాంగ్రెస్ కధ విషాధ గాధేనా, విశేషమేదైనా ఉంటుందా


ఆ పార్టీపైనే గురి :


ఏపీలో కాంగ్రెస్ బాగుపడాలంటే వైసీపీ ముందు నాశనం ఐపొయాలట. కాంగ్రెస్ సొత్తులో ఎక్కువ అక్కడే ఉందంట. వైసీపీ ఓడిపోతేనే మేము గెలిచినట్లు, నిలిచినట్లు అంటోంది పెద్ద కాంగ్రెస్.  అపుడే బిబిలమంటూ కాంగ్రెస్ లోకి అంతా తన్నుకువస్తారట. పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి ఇదే చెబుతున్నారు. ఆయన పక్కన ఉన్న పెద్దాయన ఉమెన్ చాందీ అదే అంటున్నాడు.


లాజిక్ అర్ధం కాదా :


ఇంతకీ కాంగ్రెస్ నుంచి బయటకు నాయకులు ఎందుకు పోయినట్లు. వందేళ్ళు దాటిన పార్టీకి అనుభవం ఎక్కువ  కదా. లాజిక్ అర్ధం కావడం లేదా. ఆత్మ విమర్శలు  అక్కడ అసలు ఉండవా, లేకుంటే వెళ్ళిన వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలా, ఎవరో బెదిరించో, బతిమాలో చంకన పెట్టుకుని పోవడానికి. ఏపీలో కాంగ్రెస్ ఇలా చచ్చిపోవడానికి కారణం తెలుసుకోకుండా నాలుగేళ్ళు గడిచాయి కదా జనం పాత విషయాలు మరచిపోతానుకుంటే పొరపాటే మరి.


సారీలుండవా :


ప్రజల సెంటిమెంట్ ని అసలు పట్టించుకోకుండా,అంతా నా ఇష్టం అన్న తీరున ఏపీని అడ్డగోలుగా విభజించేసీ మీ చావు మీరు చావండని జనం నెత్తిన తడి గుడ్డేసిన పాపానికి, చేసిన గాయాలకూ కనీసం చిన్నపాటి సారీలైనా ఉండవా. మేము తప్పు చేశాం, మీ మనసులను గాయపరచాం అని క్షమాపణ చెబితే సొమ్మేంపోయింది. ప్రత్యేక హొదా మేమిస్తాం అంటున్నారు. దాని అవసరం కల్పించిదే  ఏపీ ప్రజలు కోరుకోని విభజనతోనే కదా. ముందు చేసిన తప్పులకు సారీ  అయిన చెబితే జనం మనసు కొంతైనా మారవచ్చు. ఆనక పోయిన నేతలూ వెనక్కి రావచ్చు. అది మానేసి రాజకీయం చేద్దామనుకుంటే మాత్రం ఈసారి కాంగ్రెస్ కి ఏపీలో మరోసారీ తప్పదేమో.
 



మరింత సమాచారం తెలుసుకోండి: