తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.   గతంలో చాలా మంది టీఆర్ఎస్ లోకి జంప్ జలానీలు అయ్యారు. కానీ ఈ మద్య కొంత మంది టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు.  ఆ మద్య టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ కొన్ని చోట్ల గట్టి పట్టుమీదే ఉన్నది.  అందుకే నాలుగు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటూ వస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు చిన్న చిన్నగా పావులు కదుపుతున్నారు. 
Image result for modi
ప్రచార హోరు మొదలు పెట్టారు.  ఈ నేపథ్యంలో తెరపైకి జమిలీ ఎన్నికల అంశం వచ్చింది.  అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు తాము సిద్దం అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.  తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Image result for kcr
పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని, రిజర్వేషన్లపై తప్పిదాలను ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  వచ్చే ఎన్నికల్లో తాము గెలవాలని కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ రైతులపై దొంగ ప్రేమ నటిస్తున్నారు. 

తెలంగాణలో ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వీరు కాపాడారూ అంటూ ఎద్దేవా చేశారు.  తాము అధికారంలోకి వస్తే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని, క్వింటా వరికి రూ.2000, పత్తికి రూ.6000, సోయాబీన్ కు రూ.3500, కందులకు రూ.7000, మిర్చికి రూ.10 వేలు, పసుపుకు రూ.10 వేలు, ఎర్రజొన్నలకు రూ.3 వేలకు తక్కువ కాకుండా ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన సమాధానం చెప్పాలని, ‘మేము అధికారంలోకి వస్తున్నాం..నిరుద్యోగ భృతి ఇస్తాం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: