రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రజా పోరాట యాత్ర చేపడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఇంకా సరిగ్గా సంవత్సరం అన్న నేపద్యంలో ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తాను స్థాపించిన జనసేన పార్టీ బలపర్చాలని తీవ్ర కృషి చేస్తున్నాడు.
Image may contain: 1 person, smiling, beard
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తో కలిసి వామపక్ష పార్టీలు ఎన్నికల్లో పాల్గొంటాయని లెఫ్ట్ పార్టీ నేతలు అన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీకి చెందిన రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
Image result for pawan kalyan yanamala
తాజాగా ఇటీవల యనమల మీడియాతో మాట్లాడుతూ... జనసేన ఇప్పటికీ ఎన్డీఏ మిత్రపక్షమేనన్నారు. ఎన్డీఏ నుంచి బయటికొచ్చామని టీడీపీలా జనసేన ఎందుకు ప్రకటించట్లేదని పవన్‌కు.. యనమల సూటి ప్రశ్న సంధించారు. జమిలి ఎన్నికల విధానం అమల్లోకి రావాలంటే 5 సవరణలు జరగాలన్నారు. ప్రస్తుతం మైనార్టీలో ఉన్న మోడీ సర్కార్‌ ఆ సవరణలు చేసే పరిస్థితిలో లేదన్నారు.
Image may contain: 2 people, beard
జమిలి ఎన్నికలు దేశసహితం కోసం కాదని.. మోదీ-అమిత్‌షా హితం కోసమేనన్నారు. రాష్ట్రాల అజెండా ప్రజల్లోకి వెళ్లకూడదనే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని యనమల మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామని భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు యనమల.


మరింత సమాచారం తెలుసుకోండి: