తెలుగుదేశం   పార్టీలో చంద్ర  బాబు ఎంత పవర్ ఫుల్లో  లోకేష్ కూడా అంతే పవర్ఫుల్ అని చెప్పాలి.  తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నీ లోకేష్ కనుసన్నుల్లో జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.  లోకేష్ మంత్రి అయ్యే వరకు ఎవరు కూడా నోరు మెదపలేదు.  ఎందుకంటే లోకేషును  ప్రశ్నిస్తే చంద్రబాబును ప్రశ్నించినట్టే.  అందుకే సీనియర్ నాయకులు కూడా లోకేష్ గురించి ఏమీ తప్పుగా మాట్లాడరు.  అలాంటిది ఇప్పుడు టీజీ వెంకటేష్ లోకేష్ కు నా అధికారాలు ఏమిటి అని విమర్శించారు.

Image result for lokesh and tg venkatesh

ఇలా ప్రశ్నించడానికి ఆవేశం అయినా అయి వుండాలి. లేదా అజ్ఞానం అయినా అయి వుండాలి. ఈ రెండూ కాకపోతే, అవసరం అయితే పార్టీ నుంచి జంప్ అవుతాను అనే ఆలోచన అన్నా వుండి వుండాలి. ఒకటి మాత్రం స్పష్టం. ఒకసారి లోకేష్ ప్రకటించేసాక, మరి అభ్యర్ధుల మార్పు అయితే జరగదు. ఎందుకంటే, అలా మారిస్తే, టిజి వెంకటేష్ హూంకరింపులకు లోకేష్, ఆయన తండ్రి చంద్రబాబు బెదిరినట్లు కలర్ వస్తుంది. అందువల్ల అది జరగదు. ఇక మిగిలినవి రెండు ఆఫ్షన్ లే.

Image result for lokesh and tg venkatesh

ప్రస్తుతానికి బాబు ఫోన్ ఆదేశాలు వస్తే, సైలంట్ గా వుండడం. ఎన్నికల టైమ్ లో బాబు ఇచ్చే హామీలతో సరిపుచ్చుకోవడం. లేదూ అంటే జంప్ జిలానీ అంటూ వేరే పార్టీ వైపు చూడడం. అయితే అలా వేరేపార్టీలో ఇప్పటి నుంచీ వెళ్లిపోయే అవకాశం బాబు ఇవ్వరు. తానేదో చేయబోతున్నట్లు, చేస్తానన్నట్లు కలర్ ఇస్తూ ఇక్కడే వుంచే ప్రయత్నం చేస్తారు. తీరా పరిస్థితి చేజారినపుడు పార్టీ మారదాం అంటే అక్కడ అంత అవకాశం వుండదు. అందువల్ల టిజి వెంకటేష్ ఏం చేసినా, ఇప్పుడే చేయడం ఉత్తమమేమో?



మరింత సమాచారం తెలుసుకోండి: