నవ్యాంధ్రలో ఆగస్ట్ 15 పండుగను టీడీపీ సర్కార్ ప్రతీ ఏటా ఒక్కో జిల్లాలో నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈసారి చాన్స్ శ్రీకాకుళానికి దక్కింది. ఈ ఏడు జెందా పండుగ శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా జరిపేందుకు సర్కారు ఏర్పాట్లను చేస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల పేరుతో మరో భారీ షోకు బాబు రెడీ అయిపోతున్నారు.

  

అప్పుడు అక్కడ :


సరిగ్గా మూడేళ్ళ క్రితం ఆగస్ట్ 15 ఉత్సవాలను విశాఖ సాగరతీరంలో నిర్వహించారు. రాష్ట్ర యంత్రాంగం అంతా అపుడు విశాఖకు తరలివచ్చింది. పెద్ద ఎత్తున ఖర్చు కూడా అయింది. ఆనాటి బకాయిలు ఇంకా రెవిన్యూ శాఖ వద్ధ పెండింగ్ లో ఉండడం గమనార్హం. అంతకు ముందు కర్నూలులో, విజయవాడలో తిరుపతిలలొ కూడా బాబు ఆడంబరంగా ఈ వేడుకను జరిపించి జనాలను మురిపించాడు.

 

 

దండుగమారి వ్యవహారం :

 

పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అక్కడ ఎల్బీ స్టేడియం ఖాళీగానే ఉంది. కేసీయార్ ప్రతీ ఏటా గొల్కొండ కోటలోనే ఉత్సవాలు జరుపుతున్నారు. కానీ ఏపీ  సీఎం చంద్రబాబు మాత్రం జిల్లాలో  వెంబడి తిరుగుతూ సర్కార్ ధనాన్ని వ్రుధా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొట్ల రూపాయలు వెచ్చించి ఇలా చేయడం పట్ల విపక్షాలు కామెంట్స్ చేస్తున్నాయి. కానీ ప్రతీ వేడుకను తన పాలిట్రిక్స్ కు యూజ్ చేసుకునే బాబు ఇలాగే చేస్తూ పోతున్నారు. సో ఈసారి సిక్కోలులో వేడుక అన్నమాట. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: