రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో మొదటిసారిగా మంత్రి గంటా ఒకే పార్టీ నుంచి రెండవ మారు పోటీ చేయబోతున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయన టీడీపీ తరఫునే బరిలో దిగాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు టాక్. ఇప్పటికైతే ఇదే నిజమని అంటున్నారు. అందుకే అధినేత బాబుతో చెడిన బంధాన్ని పునరుధ్ధరించుకునేందుకు గంటా తంటాలు పడుతున్నారుట. ఈ మధ్య కాలంలో ఓ లెక్కన అటు జగన్, ఇటు పవన్ మీద మాటల యుధ్ధం స్టార్ట్ చేయడం వెనక మతలబు ఇదేనట.


నో ఎంట్రీ..?


టీడీపీలో కొనసాగకూడదని గత కొన్నాళ్ళుగా గంటా తెగ ఆలోచించారు. అందుకే అన్యమనస్కంగా ఉంటూ వచ్చారు. పార్టీ ప్రొగ్రాం లకు కూడా డుమ్మా కొట్టేశారు. వేరే ఆప్షన్లూ వెతికారు. ఎక్కడ తేడా కొట్టిందో కానీ మళ్ళీ ఈ గూడే సేఫ్ అనుకుంటున్నారట. జనసేనలోకి పోదామని అనుకుంటే పవన్ ఏకంగా గంటకే కౌంటర్లేస్తున్నాడు. వైసీపీ అనుకుంటే అక్కడా చాన్సే లేదంట. దాంతో ఈసారికీ అడ్జస్ట్ అయిపోవాల్సిన గత్యంతరం ఏర్పడిందట.


సెటైర్లు పడిపోతున్నాయ్ :


ఈ మధ్య గంటా జనసేనాని పై ఓ రేంజిలో ఫీర్ అవడం ద్వారా బాబు గారి వద్ద పాస్ మార్కులు కొట్టేద్దామని ట్రై చేశారు. అయితే అది కాస్తా రివర్స్ అయింది. జనసేన లోకల్ లీడర్లు మొత్తం గంటా చిట్టాను బయటేయడమే కాదు. ఏ పార్టీ లేకనే టీడీపీలో ఉంటూ బాబు మెప్పు కోసం ఈ కామెంట్లేందంటూ సెటైర్లేశారు. దాంతో గంటా టీడీపీలో ఖాయమన్న మాట కూడా ఓపెన్ అయిపోయింది. అయితే ఇది ఇప్పటి మాటే సుమా. ఎన్నికలు దగ్గరలోకి వస్తే అపుడు చూడాలి అసలు ఏ జరుగుతుందోనని పంచులూ పేలుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: