2014లో బిజెపితో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్ళాడు.  అయితే ఈ కూటమి ఆ ఎన్నికల్లో జగన్ మీద విజయదుందుభి మోగించింది.  ఈ రెండు పార్టీల మధ్య మైత్రి సుమారు నాలుగేళ్ల పాటు కొనసాగింది. తర్వాత బిజెపి కూటమి నుంచి  చంద్రబాబు బయటకు వచ్చేసాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు బీజేపీ మీద ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నాడు.  టిడిపి నాయకులు కూడా బీజేపీ మీద దాడి మొదలుపెట్టినారు. బిజెపి మోసం చేసినట్లు టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. అయితే  ఇదే విషయం మీద బిజెపి వారు టిడిపిని చాలా లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

Image result for amit shah

అసెంబ్లీ సీట్లు పెంచకపోవడంతోనే చంద్రబాబు నాయుడు బీజేపీకి దూరంగా జరిగాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాబు కూడా ఇన్ డైరెక్టుగా అదే చెబుతున్నాడు. తనను బీజేపీ వాళ్లు మోసం చేశారని అంటున్నాడు. ఆ మోసం ప్రత్యేకహోదా విషయంలో అని బాబు అంటున్నాడు. అయితే... హోదా వద్దన్నది చంద్రబాబే. హోదా అంటే జైలుకే అన్నది కూడా చంద్రబాబు నాయుడే. హోదాతో ఏమీ రాదన్నది అప్పుడు చంద్రబాబు నాయుడే. అయితే ఇప్పుడు బీజేపీ మోసం చేసింది అని అంటున్నాడు.

Image result for amit shah

ఈ మొత్తం ఎపిసోడ్లో మోసం చేస్తున్నది ఎవరో అర్థం చేసుకోవడం చిన్న పిల్లాడికి కూడా కష్టం కాదు. పచ్చకామెర్ల వారు ఎంత వాదించినా.. బాబు మాట మార్చడం జనాల్లోకి వెళ్లిపోయింది. ఇక బాబుగారి మిత్రుత్వం గురించి అమిత్ షా స్పందించాడు. చంద్రబాబు ఎన్డీయే ను వీడి వెళ్లడాన్ని ఆయన తేలికగా తీసుకున్నాడు. బాబు వెళ్తే వెళ్లాడు, నితీష్ వచ్చాడు కదా.. అని షా వ్యాఖ్యానించాడు. బాబు ఎన్డీయేను వీడి వెళ్లినా తమకు బాధేమీ లేదని.. తాము బాధపడటం లేదని షా తేల్చి చెప్పాడు. 





మరింత సమాచారం తెలుసుకోండి: