లోకేష్ రాష్ట్రం లో ఉన్న రోడ్లు అన్ని టీడీపీ రోడ్లు  అని సంబోధించే స్థితి కి వచ్చాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇతనికి తన తండ్రికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో.. ఇంతకముందు కూడా కర్నూల్ ఉప ఎన్నికల్లో కూడా చంద్ర బాబూ ఇదే మాట అన్నాడు. మేము వేయించిన రోడ్ల మీద నడుస్తూ మాకు ఓట్లు వేయరా అని... దాంతో  అక్కడున్న ప్రజలందరినీ నోరు వెళ్ళబెట్టేటట్లు చేశారు. అయితే ఇప్పడూ తన పుత్ర రత్నం కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. టీడీపీ వేసిన రోడ్ల మీద జగన్ నడుస్తూ మమ్మల్నె తిడుతున్నాడని...!

Image result for lokesh

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు జగన్. అనపర్తి నియోజకవర్గంలో ఆయన ప్రజా సంకల్పయాత్ర సాగుతోంది. 3 రోజులుగా కురుస్తున్న వానలకు నియోజకవర్గంలో రోడ్లన్నీ అస్తవ్యస్థమయ్యాయి. కేవలం ఈ నియోజకవర్గంలోనే కాదు, జిల్లా అంతా అదే పరిస్థితి కనిపిస్తోంది. వీటినే ఇప్పుడు లోకేష్ "టీడీపీ రోడ్లు" అని సంభోదిస్తున్నారు.  ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఊలపల్లి, కొమరిపాలెం, తొస్సిపూడి క్రాస్ మీదుగా జగన్ ఈ 2 రోజులు పాదయాత్ర చేశారు. దాదాపు 11 కిలోమీటర్లు నడిచారు.

Image result for lokesh

ఈ రోడ్లన్నీ బురదమయమయ్యాయి. వర్షాలకు గుంతలుపడ్డాయి. జగన్ ను చూడ్డానికి వచ్చిన ప్రజల్లో కొంతమంది జారిపడ్డారు కూడా. ఒకదశలో జగన్ కూడా అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్లు చూసి, వాన తగ్గేవరకు తన పాదయాత్రను ఆపేశారు. లోకేష్ భాషలో చెప్పాలంటే ఇవన్నీ టీడీపీ రోడ్లే. నిజంగా లోకేష్ చెప్పినట్టు టీడీపీ రోడ్లపై పాదయాత్ర చేయడం తప్పే. ఇలాంటి రహదారులపై ఎవ్వరూ పాదయాత్ర చేయలేరు. గడిచిన 3 రోజులుగా జగన్ పడినపాట్లు అన్నీఇన్నీ కావు. ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ గుంత ఉందో కూడా అర్థంకాని పరిస్థితిలో నడిచారు. అంత అందంగా ఉన్నాయి టీడీపీ రోడ్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: