రాష్ట్రస్థాయి బ్యాంకర్ల‌ సమావేశంలో రాష్ట్ర బ్యాంకుల తీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  బ్యాంకర్లు కొన్ని ప్రాంతాలను మాత్రమే పట్టించుకుంటున్నాయని అది ఎంత మాత్రం సరికాదని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల‌ సమావేశంలో సిఎం చంద్రబాబు రాష్ట్ర వార్షిక రుణప్రణాళిక సీఎం విడుదల చేశారు.  

 CM Chandrababu fire over bankers...warned banks not to cheat people

మొత్తం వార్షిక రుణప్రణాళిక రూ.1,94,220 కోట్లు. అందులో వ్యవసాయంకు రూ.1,01,564 కోట్లు. కౌలు రైతులకు ఆర్ధిక సాయం రూ.7,500 కోట్లు. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రూ.21,323 కోట్లుగా రుణాలు పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ నోట్ల డిపాజిట్లపై ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉందని, పెద్ద ఎత్తున అపోహలు ప్రచారం జరుగుతున్నాయన్నారు.  నోట్ల రద్దు తర్వాత జనం ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పేర్కొన్నారు.

ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నామన్నారు. తలసరి ఆదాయం లేని శ్రీకాకుళం లాంటి జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, విజయనగరం ఆదాయం మరీ దారుణంగా ఉందని వెల్లడించారు. పీఎన్బీ వ్యవహారంతో ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోయింది.. బ్యాంకర్లు నమ్మకాన్ని కలిగించాలన్నారు. నోట్ల రద్దు ప్రభావం ఇంకా కనిపిస్తుంది.. దానికి పరిష్కారం చూపాలన్నారు. ప్రతి నెల సంక్షేమ పథకాల కోసం నగదు వేడుకోవాల్సి వస్తోంది.. ఈ పరిస్థితిని కేంద్రానికి, ఆర్బీఐకి వివరించండిని సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: