టీడీపీ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. ఏకంగా కాగ్ ఇచ్చిన నివేదికలో అవినీతి లో ఏపీ నెంబర్ 1 అని తేల్చి పారేసింది. అయినా టీడీపీ అవినీతి కి అడ్డు అదుపు ఉండదు. అయితే ఇప్పడూ పోలవరం పరిహారం విషయం లో కూడా అది గిరిజనుల పరిహారం ముసుగులో అవినీతి చేయాలని ప్లాన్ చేసింది. అయితే విషయాన్ని బీజేపీ ముందే పసిగట్టింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. కేవలం భూసేకరణకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తాలే దాదాపు 60 వేల కోట్ల రూపాయల వరకు చేరుతున్నాయి.

Image result for nithin gadkari polavaram

సహజంగా నిర్వాసితులు అవుతున్న వారు, నష్టపోతున్న వారిలో గిరిజనుల సంఖ్య చాలా ఎక్కువ. అయితే గిరిజనుల పేరిట, ఆ ముసుగులో పరిహారాలుగా వచ్చే మొత్తాలను స్వాహా చేయడానికి తెలుగుదేశం నాయకులు ఓ స్కెచ్ వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే గడ్కరీ ఈ ఒక్క విషయంలో పట్టు వీడలేదు. గిరిజన రైతులకు భూమికి భూమి ఇవ్వాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు.

Image result for nithin gadkari polavaram

భూమికి భూమి ఇచ్చే వెసులుబాటు లేదని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కినప్పటికీ.. ముగించే ముందు గడ్కరీ మళ్లీ.. గిరిజన రైతులకు మాత్రం ఇదివరకటి కంటె మెరుగైన జీవనం ఉండే పరిస్థితి కల్పించాలని.. వారికి భూమికి భూమి ఇవ్వాల్సిందేనని చెప్పి వెళ్లారు. భూమే గనుక పరిహారంగా ఇస్తే నిజం లబ్ధిదారులకే వెళ్తుంది. దళారీ పాత్రలో నాయకులు స్వాహా చేయడం కుదరదు. భూమి ఇవ్వడానికి కుదరదంటూ చంద్రబాబునాయడు అడ్డుకోడం  కూడా ఇందుకే అని పలువురు అనుమానిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: