మనకు కావల్సింది అభివ్రుధ్ధి, ఇక్కడ నో పాలిటిక్స్. విడిపోయినా ప్రజల కోసం కలసి పనిచేయాలి, మన గొడవలతో ఏపీ నష్టపోకూడదు.. ఇవీ బాబు గారి సుద్దులు. దేశమంటా మాకు ఒక్కటే, ఎక్కడ డెవలప్మెంట్ జరిగినా మేము సంతోషిస్తాం అంటూ   కేంద్రం విశాల హ్రుదయాన్ని ఆవిష్కరిస్తారు గడ్కరి. కానీ ఆ ఇద్దరూ  మాట్లాడే ప్రతీ మాటా, ప్రతీ చేతా అంతా రాజకీయమే. అదే కదా పాలిట్రిక్స్ అంటే మరి. సీన్ చూస్తే విశాఖ మీటింగ్ సాక్షిగా పోలవరంపై క్రెడిట్ కోసం ఆ ఇద్దరూ తెగ పోటీ పడ్డారనిపించింది అందరికీ.


అన్ని లెక్కలూ అక్కడే చెబుతారట :


పోలవరం ప్రాజెక్ట్ ని రాజకీయాలకు బలి చేయవద్దు, అంతా సక్రమంగానే సాగుతోంది. వివరాలన్నీ కూడా సోమవారం డిల్లీ వచ్చి మా అధికారులు ఇస్తారు, అవసరం అనుకుంటే నేను కూడా వచ్చి లెక్కలు చెబుతాననంటూ  విశాఖ మీటింగ్ లో  గడ్కరి ముఖం మీదే కుండ బద్దలు కొట్టారు  ఏపీ బాబు. రాష్ట్రానికి న్యాయం చెయాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ సూటిగానే నిలదీశారు. తాను ప్రగతినే కోరుతున్నానని, ఇది  రాజకీయం కానే కాదని ముక్తాయింపు ఇచ్చారు.


ఆ కోణంలో చూడొద్దు :


పోలవరం జాతీయ ప్రాజెక్ట్. దానికి పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం తీసుకుందని చెప్పుకొచ్చారు గడ్కరి. ప్రతీ దానినీ రాజకీయ కోణంలో నుంచి చూడవద్దటూ సెటైర్లు వేశారు. ఎన్నికలలో ఎవరి రాజకీయం వళ్ళు చేసుకుందామంటూ సుతి మెత్తగానే కౌంటర్ ఇచ్చారు.  ఏపీ పట్ల ప్రత్యేక శ్రధ్ధ ఉందని, అన్నీ పనులూ చేస్తునే ఉన్నామని పాత పాటే వల్లే వేశారు. 


అక్కడ సిగపట్లు :


మీటింగ్ పేరిట లోపల మాటల యుధ్ధం జరిగితే, బయట టీడీపీ, బీజేపీ కార్యకర్తలు స్త్రీట్ ఫైట్ కే తెర తీసేశాయి. గడ్కరికి, బీజేపీకి అనుకూలంగా ఆ పార్టీ వాళ్ళు, బాబుకు, టీడీపీకి సపోర్ట్ గా తమ్ముళ్ళు పోటా పోటీగా జిందాబాద్ లు కొట్టేశారు. మేం గొప్ప అంటే మేము గొప్ప అంటూ ఒకరిపై ఒకరు దూసుకువచ్చేశారు. ప్లే కార్డులతో చిల్లర రాజకీయమే చేశారు. మొత్తానికి విడిపోయిన తరువాత రెండు పార్టీల తీరూ ఇలాగే ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. ఇదేనా కలసి అభివ్రుధ్ధి చేయడమ అంటే.


మరింత సమాచారం తెలుసుకోండి: