అబద్దాలు చెప్పడంలో ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించినవారు మరొకరు లేరంటూ రాష్ట్ర బిజెపి నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మల్లి అధికారం కోసం అబద్దాలు ఆడడానికి ప్రజలలోకి వెళ్తారని...ఈ నేపథ్యంలో చంద్రబాబు కల్లబొల్లి మాటలు లొసుగులు వీటినన్నిటినీ ముందే బయట పెట్టాలని బీజేపీ నాయకులు నిర్ణయించుకున్నారు.
Image result for chandrababu
ఇదిలావుండగా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తన అనుకూల ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వస్తున్నారని కమలనాధులు గుర్తు చేశారు. అయితే రాష్ట్రనికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న సీసీ రోడ్లు , నీరు , 24 గంటల కరెంటు , టాయిలెట్స్ , పేదలకు ఇల్లు ఇలా అన్నింటిపై ప్రజల్లో అవగాహన కలిపించాలని గట్కరి బీజేపీ నేతలకు సూచించారట.
Image result for chandrababu bjp
ఇకపై ఏపీ పైన అధిష్టానం ప్రత్యేక దృష్టి పెడుతుందని కేంద్ర మంత్రులు , పెద్దలు రాష్ట్రంలో పర్యటిస్తారని గట్కరి అన్నట్లు సమాచారం . ఇక చంద్రబాబు నాటకాలకు అడ్డు కట్ట వెయ్యాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే 2014 ఎన్నికలలో మోడీ హవా ఇతర నాయకులతో కలసి ప్రచారంలో పాల్గొని ఎన్నికలలో లబ్ది పొంది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు….ఈసారి రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదని అందరూ అంటున్నారు.
Related image
ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉంది ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటార? చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే ఏదైనా పార్టీ ఉందా? ఒకవేళ ఒంటరిగా ప్రజాక్షేత్రంలోకి దిగితే తెలుగుదేశం గెలుస్తుందో ఓడిపోతుంది చూడాలి మరి!


మరింత సమాచారం తెలుసుకోండి: