ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంతకముందు కాంగ్రెస్ తరుపున ఎంపీ గా పని చేసినాడు. రాష్ట్ర రాజకీయాల మీద ఎప్పటికప్పుడు తన మనసులోని మాట నిర్మోహాటంగా చెబుతుంటాడు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా 2019 ఎన్నికల గురించి పార్టీల గెలుపుల గురించి మాట్లాడినాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ తిరుగు లేకుండా సీఎం అవుతాడని జోస్యం చెప్పాడు. అలాగని చంద్ర బాబును తక్కువ అంచనా వేయలేమని చెబుతున్నాడు. 

Image result for undavalli arun kumar

బాబుకు ఉన్నన్ని ఎలక్షన్ మేనేజ్ మెంట్ స్కిల్స్ జగన్ కు లేవు. మరీ ముఖ్యంగా చంద్రబాబు పార్టీ దగ్గర, వాళ్ల నేతల దగ్గర ఉన్నంత డబ్బు జగన్ పార్టీలో లేదు. 5వేలు కాదు, అవసరమైతే 10 వేలు ఇస్తారు. దీనికి నేను ఆధారాలు చెప్పలేను కానీ, పబ్లిక్ టాక్ ఇది. ఇవన్నీ చంద్రబాబు ప్రయోగిస్తే జగన్ కు కష్టమే. కానీ ఇప్పటికిప్పుడు జెన్యూన్ గా ఎన్నికలు జరిగితే మాత్రం జగన్ వస్తాడు. ఎందుకంటే పబ్లిక్ జగన్ కు అనుకూలంగా ఉంది."

Image result for undavalli arun kumar

ఇది రాబోయే ఎన్నికలపై  ఉండవల్లి విశ్లేషణ. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోల్చిచూడలేమన్నారు ఉండవల్లి. హైదరాబాద్ నే ఉదాహరణగా తీసుకుంటే, మున్సిపల్స్ లో టీఆర్ఎస్ వెనుకంజలో ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ స్ట్రాంగ్ గా ఉందన్నారు. ఇక ఏపీ విషయానికొస్తే, ఎన్నికల ముందు చంద్రబాబు ఏదైనా జిమ్మిక్కు చేస్తే తప్ప గెలవడం అసాధ్యం అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: