భాజాపా జాతీయ అద్యక్షుడు, అమిత్ షా భాగ్యనగర పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలువురు పార్టీ ప్రముఖులతో భేటీ కావటం ఒక ఎత్తు అయితే.. నగరానికి చెందిన60 మంది కీలక సంఘ్ పరివార్.. భజరంగ్ దళ్.. వీహెచ్ పీ నేతలతోనూ సమావేశమవ్వడం మరో ఎత్తు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లుగా విశ్లేషక వర్గాల సమాచారం. 

Image result for amit shah

అయోధ్యలో శ్రీ రామజన్మభూమి.. ఉమ్మడి పౌరస్మృతి.. 370 ఆర్టికల్ రద్దు చేసిన అంశాలపై కేంద్రం వైఖరిని అడిగిన సంఘ్ నేతలకు స్పష్టత ఇవ్వడానికి అమిత్ షా ప్రయత్నించాడు.. ఈ పరిణామాలన్నీ సానుకూలంగా మారినట్లుగా ఆయన వివరించారు. రామజన్మభూమి అంశంలో అనుకూల పరిస్థితులు ఉన్నట్లు చెప్పిన ఆయన.. లోక్ సభ ఎన్నికల నాటికి పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నట్లు చెప్పటం గమనార్హం. 


టీఆర్ఎస్ తో పొత్తు ఉందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో.. బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కొందరు సంఘ్ నేతల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఒంటరిగానే పోటీ చేస్తామని తమకు ఎవరి మద్దతు గానీ సహాయం గానీ అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక.. హిందుత్వ అంశాల్ని రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో పార్టీ బలంగా తీసుకెళ్లానని మరొకరు కోరారు.

Image result for PARIPOORNANANDA SWAMI\

ఇదే సమయంలో వారి మధ్య స్వామీ పరిపూర్ణానంద విషయంలో హిందుత్వకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని కలవకూడదన్న ఒకరి మాటపై స్పందించిన అమిత్ షా.. "మీ ఆవేదన నాకు అర్థం అయింది. కానీ.. శత్రువులను మరింత బడ్డ శత్రువులుగా  చేసుకోకూడదు" అంటూ అనునయించినట్లుగా తెలిసింది. టీఆర్ ఎస్ నేతలతో కలవొద్దన్న సూచనపై షా ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారటమే కాదు.. చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: