ఆయన బీజేపీకి చెందిన విశాఖ ఎంపీ నిన్నటివరకు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కూడా. బీజేపీ, టీడీపీ విడిపోయినా బాబు పట్ల మనసులో అభిమానం మాత్రం ఆలాగే ఉంది. ఆ విషయాన్ని ఎక్కడా దాచుకోకుండా బయట పెట్టడమే ఆయనలోని ప్రత్యేకత. పట్టిసీమ అంటే అవినీతి అంటూ ఓ వైపు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి వాళ్ళు  విరుచుకు పడుతూంటే అదే పట్టి సీమను శభాష్ అనడం హరిబాబుకే చెల్లింది. నిజానికి పట్టి సీమలో చోటు చేసుకున్న అవినీతిపై ఈయన ఏనాడు పెదవి విప్పలేదు.


యూ టర్న్ ఓ వ్యూహంట :


రాజకీయాలలో సిధ్ధాంతాలు, చింతకాయ అంటూ నిత్యం నీతులు చెప్పే బీజేపీలో సుదీర్ఘ కాలం పనిచేస్తూ వస్తున్న హరిబాబు బాబు యూ టర్న్ ని సైతం సపోర్ట్ చేస్తూ మాట్లాడడం విశేషం. గత నాలుగు నెలలుగా మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూంటే అదంతా రాజకీయ వ్యూహమంటూ సింపుల్ గా ఈ బీజేపీ పెద్దాయన కొట్టిపారేయడం గమనార్హం. ప్రత్యేక హోదాపై ఎవరి రాజకీయం వారిదంటూ మధ్యలో జగన్ ని కూడా కలిపేశారు.


ఎవరితోనూ పొత్తుల్లేవు :


వచ్చే ఎన్నికలలో తమ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని హరిబాబు క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తుందని జగన్ చెప్పారని, పవన్ కూడా అదే అన్నారని, ఇంక ఆ పార్టీలు మాతో కుమ్మక్కు అయ్యాయని చెప్పడంలో అర్ధం లేనే లేదన్నారు. మొత్తానికి బీజేపీది కూడా ఒంటరి పోరేనని చెప్పేశారు.


రిటైర్మెంటేనా :


టీడీపీ చలవతోనే 1999లో తొలిసారి ఎమ్మెల్యే అయిన హరిబాబు మళ్ళీ అదే టీడీపీ పొత్తుతో ఏకంగా పార్లమెంట్ మెంబర్ అయిపోయారు. సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావన్న సంగతి ఆయనకూ బాగా తెలుసు. అందుకే అసెంబ్లీ, పార్లమెంట్ రెండూ చూసేశాంటూ పోటీ చేయబోవడం లేదని చెప్పకనే చెప్పేశారు. ఎంతైనా బాబు మాజీ మిత్రునిగా ఆ పాటి రాజకీయం తెలియదా ఏంటి.


మరింత సమాచారం తెలుసుకోండి: