రాజకీయాలలో ఉంటూ సభ్యసమాజంలో గౌరవంగా హుందాగా ఇతరులకు ఆదర్శంగా మెలగాల్సిన నాయకులు తప్పుడు జీవితాలు జీవిస్తూ తప్పుడు మార్గాలలో నడుస్తూ సమాజానికి చీడపురుగుల్లా మారుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రజాధనాన్ని దోచుకుని ధనవంతులు అవుతుంటే...మరికొందరు మహిళలతో అక్రమసంబంధాలు పెట్టుకున్ని కామాంధుల అవుతున్నారు. ఇటీవల కాశ్మీరు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే తనకు భార్య ఉండగానే మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న వైనం బయటపడింది.

Image result for bjp mla gagan bhagat

దీంతో విషయం తెలుసుకున్న భార్య పార్టీ అధిష్టానంతో మొర‌పెట్టుకుంటోంది. భార్య‌తీరుపై చిర్రెత్తిపోయిన ఆ ఎమ్మెల్యే నా భార్య కు - నాకు మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. న‌న్ను బ‌ద్నాం చేయ‌డానికే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని..నిరూపిస్తే నా ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసురుతున్నారు. దీంతో ఎవ‌రు చెప్పేది నిజ‌మో అని తేల్చే ప‌నిలోప‌డ్డారు పార్టీ పెద్ద‌లు.

Image result for bjp mla gagan bhagat

 జ‌మ్ము - కాశ్మీర్ కు చెందిన జీజేపీ ఆర్ ఎస్ పుర నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గ‌గ‌న్, అదే నియోజ‌క వ‌ర్గానికి మ‌హిళా విభాగానికి కార్య‌ద‌ర్శిగా ఉన్న ఎమ్మెల్యే గ‌గ‌న్ భార్య మోనికా శ‌ర్మ రోడ్డెక్కింది. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీతో నేను మీ కుటుంబంలోని కుమార్తెగా భావించి న్యాయం కోసం అభ్యర్థిస్తున్నా.నా కోస‌మో, పిల్ల‌ల‌కోసమో కాదు.

Image result for bjp mla gagan bhagat

19ఏళ్ల ఆ యువ‌తి కోసం అంటూ అభ్య‌ర్ధించింది. ఈ విషయాలన్నీ మీడియా సమావేశం పెట్టి బట్టబయలు చేయడంతో బీజేపీ పార్టీలో చర్చనీయాంశమైంది. మరోపక్క ఆమె భర్త గ‌గ‌న్ తన భార్యను మౌనిక శ‌ర్మ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమ మధ్య మనస్పర్థలు వచ్చాక మతిస్థిమితం లేని కామెంట్స్ చేస్తుందని పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: