ఉత్తరాంధ్ర జిల్లాలలో పాగా వేద్దామని జనసేనానికి సీనియర్ నాయకులు షాక్ ఇస్తున్నారు. పార్టీలో చేరమంటూ స్వయంగా కోరుతున్నా ఆశించిన స్పందన రావడంలేదు. నిజానికి  యాభై రోజుల పాటు పవన్ కాలికి బలపం కట్టుకుతిరిగినా సరైన నాయకులెవరూ ఇంతవరకూ పార్టీ గడప తొక్కకపోవడం ఆందోళన కలిగించే పరిణామమేనంటున్నారు. విశాఖ వంటి జిల్లాలో  ఉద్దండులు ఎందరో ఉన్నా కొత్త పార్టీకి బోణీ కావడం లేదు.


ఆ మాజీ మంత్రి అలా:


పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి మరీ పిలిచినా ఆ పెద్దాయన ఇంకా ఆలోచనలోనే ఉన్నట్లు భోగట్టా. అనకాపల్లి టూర్లో పవన్ పనిగట్టుకుని మరీ మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో భేటీ వేశారు. పాత పరిచయాలు సైతం తిరగేసి పార్టీలోకి రావాలంటూ ఒపేన్ ఆఫర్ ఇచ్చేశారు. మీ లాంటి రాజకీయ అనుభవం కలిగిన పెద్దలు పార్టీకి అవసరమంటూ తెగ పొగిడారు. అంతా విన్న దాడి ఆలోచించి చెబుతానంటూ  తాపీగా జవాబు ఇవ్వడంతో జనసేనానికి షాక్ తగిలింది.


వాళ్ళంతా వేరే రూట్ :


చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు కలసి నడిచిన వారంతా ఇపుడు పవన్ జనసేన వైపు కన్నెత్తి అయినా చూడడంలేదు. వాళ్ళలో అత్యధికులు ఇపుడు టీడీపీతో ఉన్నారు. మరికొంత మంది వైసీపీలో ఉన్నారు. యువరాజ్యం అధ్యక్షునిగా పవన్ కి వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి. కానీ రాజకీయంగా మాత్రం మా రూటే సెపరేట్ అంటున్నారు. దాంతో జనసేనకు మూడు జిల్లాల నుంచి గట్టి లీడర్లు కనిపించడంలేదు.


అది పొరపాటేనా :


నిజానికి విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేనలోకి వద్దామనుకున్నట్లు టాక్. అయితే పవన్ రాజకీయ అపరిపక్వతతో ఆయన పైనే బాణాలు వేసేశారు. దాంతో సీన్ రివర్స్ అయింది. గంటా వెనక్కు పోవడంతో ఆయన గ్రూప్ అంతా సైలెంట్ అయ్యారు. అంతేనా పవన్ మీద మాటలతో అటాక్ చేస్తూ చేయాల్సిన నష్టం చేస్తున్నారు. ఇప్పటికైతే పెద్దగా పేరున్న నాయకుడు ఎవరూ జనసేనలో చేరలేదు. మరి వచ్చే రొజులలో చేంజ్ ఏమైన ఉంటే చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: