జేసి దివాకర్ రెడ్డి తన కొడుకు ను అనంతపురం ఎంపీ గా నిలబెట్టాలని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే అనంత పురం లో జేసి కి శత్రువులు ఎక్కువ అయ్యారు అని చెప్పాలి. ప్రతి ఎమ్మెల్యే తో జేసి ఖయ్యం పెట్టుకున్నాడు. దీనితో జేసి కి స్వంత టీడీపీ నేతలే సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. అయితే జేసి తన తనయుడు ను పవన్ కుమార్ ను ఎలాగైనా గెలిపించాలని ప్రయత్నిస్తున్నాడు. 

Image result for jc diwakar reddy son

పోటీచేయడం ఓకే, పవన్‌కు అనుకూలతలు ఏమిటి, ప్రతికూలతలు ఏమిటి అనే అంశాల గురించి.. వాకబు చేస్తే ప్లస్‌ పాయింట్ల కన్నా నెగిటివ్‌ పాయింట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది జేసీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఇమడకపోవడం. అక్కడ అడుగుపెడుతూ పెడుతూనే చాలారకాల చిచ్చులు పెట్టుకున్నాడు  దివాకర్‌ రెడ్డి. అవి పెరిగి పెద్దవే అవుతున్నాయి కానీ, తగ్గడంలేదు. ఇక సోలో ఇమేజ్‌ మీద ఒక ఎంపీ సీట్లో గెలిచేంత సీన్‌ జేసీకి లేదు. అవతల కోట్ల జయసూర్య ప్రకాష్‌ రెడ్డి లాంటి వ్యక్తి గత ఎన్నికల్లో కూడా ధైర్యంచేసి కాంగ్రెస్‌ పార్టీ తరఫునే నిలబడ్డాడు. లక్షకు పైగా ఓట్లను సొంతం చేసుకున్నాడు.

Image result for jc diwakar reddy son

అదీసత్తా అంటే. గెలిచామా, ఓడామా అనేదికాదు. ఉనికి చాటామా లేదా అనేది విషయం. ఇప్పుడు కోట్లను తమ పార్టీలోకి రమ్మని అటు తెలుగుదేశం, ఇటు  వైసీపీ రెండూ కోరుతున్నాయి. ఆయన వస్తానంటే రెడ్‌కార్పెట్‌ వేయడానికి రెండు పార్టీలూ సై అంటున్నాయి. అయితే కోట్ల మాత్రం ధీమాగా ఉన్నాడు. ఆ రకంగా కోట్ల గొప్పోడు అనిపించుకుంటున్నాడు. జేసీ మాత్రం చిల్లరమల్లర వ్యాఖ్యానాలతో కామెడీ పీస్‌ అయిపోయాడు.జేసీ దగ్గర వేలకోట్ల రూపాయల ఆస్తులు ఉండవచ్చు, కోట్ల వద్ద ఆస్తులు, అధికారం రెండూ లేకపోవచ్చు. రేపటి ఎన్నికల్లో కోట్ల మళ్లీ కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి గెలవడు అని తెలసి కూడా లక్ష ఓట్లను సంపాదించగలడు అదీ గొప్పదనం.


మరింత సమాచారం తెలుసుకోండి: