మళ్ళీ మాదే పవర్ అని జబ్బలు చరచుకుంటున్న అధికార పార్టీకి ఈసారి ఉత్తరాంధ్ర భారీ షాక్ ఇచ్చేలా ఉంది. పోయిన ఎన్నికలలో ఎనభై శాతం పైగా సీట్లను గెలుచుకున్న టీడీపీకి   ఇపుడు చుక్కలు కనిపిస్తున్నాయి. బీసీలు, కాపులు బాగా ఉన్న ఈ జిల్లాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాయి. దాంతో టీడీపీ ఫేట్ చేంజ్ అవుతోంది. ఈ పరిణామాలు పసుపు పార్టీకి  హై బీపీని తెస్తున్నాయి.


ఆ లెక్కే వేరు :


పోయిన ఎన్నికలలో  విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఉన్న మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో మిత్రపక్షం బీజేపీ ఒక  సీటు కూడా కలుపుకుని పాతిక ఎమ్మెల్యేలను టీడీపీ పట్టేసింది. అలాగే అయిదు ఎంపీ సీట్లలో నాలుగు సునాయాసంగా గెలుచుకుంది. ఇది చాలదన్నట్లుగా వైసీపీ నుంచి నలుగురిని గుంజేసి ఆ నంబర్ 29కి పెంచుకుంది. అంతకు ముందే అరకు ఎంపీ గీతను లాగేసి అయిదు ఎంపీలు తనవేననిపించుకుంది. చెప్పాలంటే ఇపుడు టీడీపీ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి మరి.


రివర్స్ గేర్లో సైకిల్ :


ఎన్నికలు దగ్గరలో ఉన్నాయనగా సీన్ రివర్స్ అయింది. సైకిల్ కి ఎక్కడికక్కడ పంచర్లు పడ్డాయి. సిక్కోలు జిల్లా మొదలు, విశాఖ వరకు అంతా రిపేర్లే, అన్నీ బ్రేకులే. అధికార పార్టీ నాలుగేళ్ళ పాలన వ్యతిరేకతను బాగా పోగేసింది. చెప్పిన మాటలూ, ఇచ్చిన హామీలు పక్కలు పోవడంతో ఈ జిల్లాలు తిరగబడుతున్నాయి. బీసీలు, పేదలు ఎక్కువగా ఉన్న చోటనే అధికార పార్టీకి డేంజర్  బెల్స్ మోగుతున్నాయి.


ఆ రిజల్ట్ రిపీట్ :


సరిగ్గా 2004 నాటి పరిస్థితులే ఉత్తరాంధ్రలో ఉన్నాయి. వలసలు పెరిగిపొయవడం, రైతాంగం సాగు నీరు లేక అల్లల్లాడడం, నిరుద్యోగం బాగా పెరగడం, యువత నిరాశలో ఉండడం వంటివి టీడీపీకి  పెను గండంగా మారనున్నాయి. రైల్వే జోన్ వస్తే ఉపాధి వచ్చేది, వెనకబడిన జిల్లాల ప్యాకేజ్ వస్తే పరిశ్రమలు వచ్చేవి, ఏవీ లేకపోవడంతో టీడీపీకి మొదటి దెబ్బ పడిపోతుందంటున్నారు.  2004లో కాంగ్రెస్ కి ఈ జిల్లాలు ఇరవైకి పైగా  సీట్లు ఇచ్చి పీఠం మీద కూర్చోబెట్టాయి. మళ్ళీ ఆ సీన్ రిపీట్ అవడం ష్యూర్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: