సరిగా నాలుగు సంవత్సరాల క్రితం ఆహా మోడీ ఓహో మోడీ అంటూ జబ్బలు చరుచుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు నోరు మూసుకుని ఉండేలా చేసాడు మోడీ. ఎన్నో అంచనాలతో విడుదల అయిన సినిమా ప్లాప్ అయితేనే డీలా పడిపోయే ఈ దేశం లో ప్రధాని గా దేశం గ్రాఫ్ మొత్తం మార్చేస్తాడు అని ఫీల్ అయిన టైం లో మోడీ చేసిన వ్యవహారం అందరికీ చిరాకు తెప్పించింది.

Image result for modi 2014


తోపు - తురుపు ప్రధాని అంటూ గద్దేకి ఎక్కిన మోడీ ఇప్పటి వరకూ ఎంత అప్రతిష్ట మూట గట్టుకున్నాడు అనేది స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు . ఎంపీ గా గెలిచి వారణాసి కి ప్రాతినిధ్యం వహించి ఆ తరవాత ప్రధాని అయిన ఆయన వారణాసి దశ దిశ మార్చేస్తా అంటూ అప్పట్లో చాలా స్టోరీ లే చెప్పుకొచ్చాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా గంగా నది ప్రక్షాళన పాయింట్ ని ఓటు బ్యాంకు గా మార్చుకోవడం లో బీజేపీ విపరీతం గా సక్సెస్ అయ్యింది.


Image result for modi 2014

ముఖ్యంగా మోడీ ప్రతిష్టాత్మకం గా పోటీ చేసిన వారణాసి ప్రాంతం లో ఈ పాయింట్ చాలా ఉపయోగపడింది. ప్రాచీన వైభవాన్ని కోల్పోకుండా వారణాసి ప్రాంతాన్ని నెత్తిన పెట్టుకుంటా అని మాట ఇచ్చి మోడీ సీటు గెలిచాడు చాలా తేలికగా. హిందూ ఓటు బ్యాంకు కూడా చాలా బాగా వర్క్ అవ్వడం తో మోడీ కి ఈ ప్రాంతం ఇలాఖా గా మారిపోయింది.

Image result for modi 2014



ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ దుస్థితి గురించి తాజాగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వారణాసి దుస్థితికి గత ప్రభుత్వాలే కారణంగా ఆయన అభివర్ణించారు. ప్రాచీన వైభవాన్ని కోల్పోకుండానే కాశీని అధునాతనంగా తీర్చి దిద్దనున్నట్లు చెప్పారు. ఇలాంటి మాటలన్ని అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే చెప్పి.. ఇప్పటికి చేతల్లో చేసి చూపించి ఉంటే ఒక పద్దతిగా ఉండేది. అది మానేసి ఎప్పుడో వెళ్ళిపోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పడి గోల చెయ్యడం అనేది చాలా చిన్నతనం గా ఉంది అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.  గత పాలకుల మీద ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూడటం చూస్తే.. ప్రధాని మోడీ మీద ఉన్న గౌరవం తగ్గటం ఖాయమని చెప్పక తప్పదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: