గోదావరిలో ప్రజల ప్రాణాలు కలిసి పోతున్నాయి. ఒక సారి జరిగితే ఏదో పొరపాటు అనుకోవచ్చు ఇలా ప్రతి సారి జరుగుతుంటే ఎవరిదీ తప్పు అనుకోవాలి ఎవరినీ భాద్యులను చేయాలి. దీనికి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇంకా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి కారణం అని చెప్పాలి. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వాటికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ప్రభుత్వం ఎప్పటిలాగే పరిహారం అని చేతులు దులుపేసుకున్నది. 

Image result for chandrababu naidu

ఏపీని సింగపూర్‌ చేస్తా, ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఒకటి, బ్లూ గ్రీన్‌ సిటీ చేస్తా, సవాలక్ష హబ్‌లు చేస్తా, అది చేస్తా ఇది చేస్తా అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పడవ ప్రమాదాలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? తానే ప్రమాదాలకు కారకుడు అవుతున్నప్పుడు ఇంకెవరి మీద చర్యలు తీసుకుంటారు? లంక గ్రామాల్లో రోడ్లు, వంతెనలు ఎందుకు నిర్మించడంలేదు? అద్భుత అమరావతి ఒక్కటే ప్రధానమా?  

Image result for chandrababu naidu

ఈ ప్రమాదానికి పరోక్షంగా బాబే కారకుడని ఎందుకు అంటున్నామంటే...రెండో శనివారం పాఠశాలకు సెలవు. చక్కగా ఎంజాయ్‌ చేయాల్సిన పిల్లలను వనం-మనం కార్యక్రమానికి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాఠశాలలకు సెలవు రద్దు చేసి వనం-మనం కార్యక్రమానికి తరలించారు. లంక గ్రామాల్లోని ప్రజలకు ఎక్కడికి వెళ్లాలన్నా పడవలే గతి. వీరందరినీ పడవలో తీసుకెళుతుండగా, అది ప్రమాదానికి గురైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: