చివ‌ర‌కు వైసిపి శీల‌ప‌రీక్ష‌కు నిల‌బ‌డాల్సొచ్చింది. బిజెపి, వైసిపి కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని తెలుగుదేశంపార్టీ చేస్తున్న ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని నిరూపించుకోవాల్సిన అవ‌సరం ఇపుడు వైసిపికి ఎదురైంది. అందుక‌నే త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న రాజ్య‌స‌భ డిప్యూటి ఛైర్మ న్ ఎన్నిక‌ల్లో బిజెపికి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని నిర్ణ‌యించింది.  తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తిలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ ముఖ్యుల‌తో సుదీర్ఘంగా స‌మావేశ‌మై ఈ మేర‌కు న‌ర్ణ‌యం తీసుకున్నారు. 


బిజెపికి మ‌ద్ద‌తిచ్చిన వైసిపి

Image result for bjp and ycp

ఆమ‌ధ్య ఎప్పుడో రాష్ట్ర‌ప‌తికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో బిజెపికి వైసిపి మ‌ద్ద‌తిచ్చిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  ఎన్డీఏలో లేని జ‌గ‌న్  బిజెపి అభ్య‌ర్ధికి మ‌ద్ద‌తివ్వాల‌ని నిర్ణ‌యించ‌టాన్ని చంద్ర‌బాబునాయుడు, టిడిపి ఇప్ప‌టికీ బుర‌ద చ‌ల్లుతూనే ఉన్నాయి. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌వులు  సాధ్య‌మైనంత వ‌ర‌కూ ఏక‌గ్రీవమ‌వ్వాల‌న్న‌ది వైసిపి నిర్ణ‌యం. స‌రే, జ‌గ‌న్ నిర్ణ‌యం ఏదైనా  టిడిపి మాత్రం వైసిపిపై ఇప్ప‌టికీ బుర‌ద చ‌ల్లుతూనే ఉంది. త్వ‌ర‌లో ఎన్నిక‌లు వస్తున్న నేప‌ధ్యంలో టిడిపి ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జ‌గ‌న్ గ్ర‌హించారు. అందులో భాగంగానే డిప్యుటి ఛైర్మ‌న్  ఎన్నిక‌ల్లో బిజెపి వ్య‌తిరేక ఓటు వేయాల‌ని నిర్ణ‌యించారు. 


చంద్రబాబు బుర‌ద‌చ‌ల్లుడు  కార్య‌క్ర‌మం

Image result for chandrababu naidu photos

జ‌గ‌న్ నిర్ణ‌యాలు,  పార్టీ విధానాలు ఎలాగున్నా వాటిని  అమ‌లు చేయ‌టంలో చిత్త‌శుద్ది, పార‌ద‌ర్శ‌క‌త  అవ‌స‌ర‌మ‌న్న విష‌యం అంద‌రూ ఒప్పుకోవాల్సిందే. అందులో భాగంగానే జ‌నాల‌కు పార‌ద‌ర్శ‌త అవ‌స‌రం. వైసిపి వాద‌న ఎలాగున్నా ఆ పార్టీపై చంద్ర‌బాబు మాత్రం బుర‌ద‌చ‌ల్లుతూనే ఉన్నారు.  అందులో నుండి త‌ప్పించు కోవ‌టానికే జ‌గ‌న్ తాజా నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది. మ‌రి,  బిజెపితో క‌లిసి పోయార‌న్న టిడిపి ఆరోప‌ణ‌లే నిజ‌మ‌ని జ‌నాలు న‌మ్మితే రాబోయే ఎన్నిక‌ల్లో పెద్ద దెబ్బ ప‌డ‌టం ఖాయ‌మే. ఎందుకంటే, ముస్లిం మైనారిటీల ఓట్లు ప‌డేది అనుమాన‌మే. 


అందుకే వ్య‌తిరేకిస్తోందా ?


పోయిన ఎన్నిక‌ల్లో మైనారిటీల్లోని  అత్య‌ధిక ఓట్లు వైసిపికి అనుకూలంగా ప‌డ్డాయి.  వ‌చ్చే ఎన్నిక‌లు జ‌గ‌న్ కు చాలా కీల‌కం. అటువంటి ప‌రిస్ధితుల్లో పోయిన‌సారి మ‌ద్ద‌తిచ్చిన ఏ వ‌ర్గం దూర‌మైనా జ‌గ‌న్ కు ఇబ్బందే. అందుక‌నే తాను బిజెపికి వ్య‌తిరేక‌మే అని నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ త‌ప్ప‌లేదు. అందులో భాగంగానే ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం బిజెపికి  వ్య‌తిరేకమ‌నే సంకేతాల‌ను జ‌గ‌న్ పంపుతున్నారు. మ‌రి ఈసారి టిడిపి ఏం చేస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: