విశాఖ రైల్వే జోన్ ఇపుడు అందరికీ కావల్సివస్తోంది. ఎన్నికలు దగ్గరలో పెట్టుకుని ఓట్ల వేటకు రెడీ అవుతున్న రాజకీయ జీవులకు జోన్ ఓ వరంగా మారుతోంది. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివారు. అందుకే మరో మారు జోన్ అంటూ జనంలోకి వస్తున్నారు. ఈసారి జోన్ పేరిట ఏకంగా విశాఖ రైల్వే స్టేషన్ ఎదురుగానే పడక సీన్ కి తయార్ అయిపోయారు. 


సమరమేనట :


నాలుగేళ్ళు కేంద్రంతో ఊరేగినపుడు జోన్ గుర్తుకు రాలేదు. ఇపుడు మాత్రం సమరమే అంటున్నారు పసుపు తమ్ముళ్ళు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే జోన్ ఇస్తామని హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన టీడీపీ ఇన్నాళ్ళూ ప్రతిపక్షం ఆందోళనలు చేస్తే అడ్డుకుంది. వెటకారం చేసింది. ఇపుడు మాత్రం ఆ క్రెడిట్ ఏదో తమకే రావాలన్న ఆరాటంతో పోరాటం అంటోంది. ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ మంత్రులు, సామంతులూ గర్జిస్తున్నారు. 


విపక్షాల షాక్ :


నాన్ పొలిటికల్ జేయేసీ అంటూ జోన్ కోసం పోరాటానికి తెర తీసిన మంత్రి గంటాకి విపక్షాలు షాక్ ఇచ్చాయి. ఆ జేయేసీలో తాము చేరటంలేదని స్పష్టం చేశాయి. దీంతో మంత్రి, ఆయన భజన చేసే సంఘాలు తప్ప మరెవరూ అటు వైపుగా తొంగి చూసే అవకాశమే లేదంటున్నారు. మరో వైపు ఈ మధ్య కాలంలో జిల్లాలోనూ, పార్టీలోనూ పోయిన ఇమేజ్ ని తిరిగి సంపాదించేందుకు జోన్ ఒక ఆయుధమని కూడా సెటైర్లు పడుతున్నాయి. సో. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎల్లుండి మార్నింగ్ ఏడు గంటల వరకు జోన్ షోను వైజాగ్ జనం హ్యాపీగా చూసెయొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: