ఇలా చేరారో లేదో అలా ఫోన్ పాట్టేసుకున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. విశాఖ జిల్లాతో పాటు, ఉత్తరాంధ్ర నాయకులకు తెగ ఫోన్లు చేసేస్తున్నారట. పార్టీలోకి నేనొచ్చేశా, మీరు కూడా రండి, ఇక్కడంతా హ్యాపీ అంటూ ఫోన్ ముచ్చట్లు పెడుతున్నారుట. పెద్దాయన అని ఫోన్ తీస్తే ఒకటే ఊదరగొట్టేస్తున్నారట. ఇదేం తగలాటకం రా   బాబూ అంటున్నారు ఇతర పార్టీలలో చేరిపోయిన మాజీ ఖద్దరు ఆసాములు.


ఆవిడ డైలామా :


విశాఖ జిల్లా నర్శీపట్నం మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాపకు కిరణ్ నేరుగా ఫోన్ చేసి కాంగ్రెస్ లో చేరమంటున్నారని భోగట్టా. ఆమె వైసీపీ వైపు చూస్తున్నారు. పోయిన ఎన్నికలలో చివరాఖరున వచ్చి వైసీపీ టికెట్ అడగడంతో జగన్ నో అన్నారు. దాంతో పార్టీలో చేరినా కూడా టీడీపీకి సపోర్ట్ చేసిన ఆమె ఇపుడు మళ్ళీ వైసీపీ టికెట్ కోసం పైరవీలు మొదలెట్టేశారు. అక్కడ వైసీపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు. సో ఆమెకు నో చాన్స్. మరి ఆమె ఉంటారా. వెళ్తారా. ఇదే డైలామా.


పెద్ద తలకాయలకూ హలో :


కాంగ్రెస్ నుంచి వచ్చేసి తమ బతుకేదో బతికేస్తున్న పెద్ద తలకాయలకూ మాజీ సీఎం ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారట. పార్టీలో చేరాలని డైరెక్ట్ గానే అడిగేస్తున్నారట. ఆయనతో ఉన్న మొహమాటం వల్ల ఏమీ అనలేని మాజీలు ఏపీలో ఏముందని చేరడానికంటూ క్యాడర్ వద్ద సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి మాజీ సీఎం ఇలా హలో అంటే పొలోమని వెళ్ళేందుకు ఇక్కడ ఎవరూ లేరని కౌంటర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: