అమెరికా లోని మిస్సోరి రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన కొప్పు శరత్‌(26) అనే విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని దుండగుడు శరత్ ను కాల్చి చంపాడు. పాయింట్ రేంజ్ లో గన్ తో కాల్చి చంపటంతో శరత్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.  అయితే హంతకుడు సిసి కెమెరాలో కనిపంచడంతో అమెరికా పోలీసులు అలర్ట్ అయ్యారు. 

శరత్ మృతిచెందిన వార్త తెలిసినప్పటి నుండి హైదరాబాద్ అమీర్ పేటలో నివాసముంటున్న అతడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.  అమెరికాలో కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన శరత్‌ మృతదేహం.... ఆయన స్వస్థలమైన వరంగల్‌లోని కరీమాబాద్‌ లో అంత్యక్రియలు నిర్వహించారు. లువురు నాయకులు శరత్ మృతదేహానికి నివాళులర్పించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు శరత్ తల్లిదండ్రులు మాలతి, రామ్మోహన్, కుటుంబసభ్యులను ఓదార్చారు.

కరీమాబాద్ లోని స్మశాన వాటికలో అతని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఘటనపై మంత్రి కేటీఆర్, డిజిపి మహేందర్ రెడ్డి, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ లకు శరత్ తల్లిదండ్రులు నివేదిక ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అమెరికాలోని భారతీయులకు రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. 

కాగా, ఎదురు కాల్పుల్లో అనుమానితుడు మృతి చెందినట్లు తెలుస్తుంది. అనుమానితుడి సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని వెంబడించారు. అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా..నింధితుడు వారిపై కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులపై ఎదురు దాడి జరిపిన నింధితుడిని పోలీసులు కాల్చి వేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: