Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 9:52 pm IST

Menu &Sections

Search

జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ఎన్నికల హడావుడి నడుస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంట్ కు ఒకేసారి నిర్వహించాలనేది జమిలి ఎన్నికల ఉద్దేశం. అసలు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది.. ఎందుకు వచ్చింది.. దీని వల్ల ఉపయోగాలేంటి.. నష్టాలేంటి.. అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం.. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదలైన జమిలి ఎన్నికల చర్చ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచనపై లా కమిషన్‌ గతంలోనే పకడ్బందీగా నివేదిక ఇచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలోని కనీసం రెండు నిబంధనలు సవరించాల్సి ఉంటుందని తెలిపింది. నిజానికి ఈ ప్రతిపాదన చాన్నాళ్ల క్రితమే బీజేపీ తీసుకొచ్చింది. ఏకకాలంలో ఎన్నికలు అవసరమంటూ 2012లో బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె. అద్వానీ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ రెండున్నరేళ్ల క్రితం ఈ అంశాన్ని మరోసారి ఎజెండాలోకి తెచ్చారు.

india-modi-amit-shah-all-parties-assembly-polls-el

          మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ జమిలి ఎన్నికలకు అనుకూలంగా చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇటీవలి కాలంలో కేంద్రం మీద అవిశ్వాసం ప్రతిపాదించే సమయానికి వచ్చిన ఒక ప్రతిపాదన ఈ జమిలి ఎన్నికల దిశగా కీలకమైన ముందడుగుగా విశ్లేషకులు అభివర్ణించారు. ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ఎవరైనా ప్రతిపాదిస్తే.. కూలిపోయే ప్రభుత్వం స్థానంలో ఏర్పడబోయే ప్రత్యామ్నాయ ప్రభుత్వం మీద విశ్వాసం కూడా ప్రతిపాదించాలి. దీనివల్ల బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు చెక్ పడుతుందనేది అందరి విశ్వాసం. అదే సమయంలో.. అవిశ్వాసం వలన ప్రభుత్వం పడిపోయేట్లయితే.. దానివల్ల ఎన్నికలు రాకుండా మరో ప్రభుత్వం వెంటనే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా జమిలి ఎన్నికలను రెండు దశల్లో అమల్లోకి తీసుకురావడానికి వీలుగా.. లా కమిషన్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2019 కొన్ని రాష్ట్రాలను, 2024లలో కొన్ని రాష్ట్రాలను జమిలి ఎన్నికల పరిధిలోకి తీసుకురావచ్చని లా కమిషన్ ప్రతిపాదిస్తోంది. కొన్ని రాజ్యాంగ సవరణలతో ఇది సాధ్యమవుతుందని.. మరికొన్ని అంశాలను పార్లమెంటులో సాధారణ మెజారిటీతో ఆమోదించుకోవచ్చునని లా కమిషన్ పేర్కొంది.

india-modi-amit-shah-all-parties-assembly-polls-el

          నిజానికి దేశంలో జమిలి ఎన్నికల ప్రక్రియ.. తొలి లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదలైంది. నాలుగో లోక్‌సభకు ఆటంకం కలిగేంత వరకూ జమిలి ఎన్నికలు కొనసాగాయి. స్వాతంత్ర్యానంతరం 1952, 1957, 1962, 1967 సంవత్సరాలలో అన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే 1969లో కాంగ్రెస్ లో విభజన రావడంతో 1971లో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలకు మొగ్గు చూపారు. అక్కడ నుంచి సార్వత్రిక ఎన్నికలకు ఆటంకం ఏర్పడింది. 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలన్నింటినీ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించింది. 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఇందిరాగాంధీ రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో జమిలి ఎన్నికలకు బ్రేక్‌ పడింది. ఆ తర్వాత కేంద్రంలో ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కాలపరిమితి ఏర్పడుతూ వచ్చింది. కాలక్రమంలో కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల గడువు లోక్‌సభ గడువు కలవడంతో లోక్‌సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇదే కోవలో 2014లో ఏపీ, తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు లోక్ సభతో పాటు ఎన్నికలు జరిగాయి.

india-modi-amit-shah-all-parties-assembly-polls-el

          జమిలి ఎన్నికల వల్ల లాభనష్టాలను ఒకసారి పరిశీలిస్తే.. పదే పదే ఎన్నికలు నిర్వహించాల్సి రావడం వల్ల ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు కొత్తగా ఎలాంటి అభివద్ధి కార్యక్రమాలను ప్రకటించకూడదు. చేపట్టకూడదు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఆ రాష్ట్రానికి సంబంధించిన అభివద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టరాదు. పర్యవసానంగా అభివద్ధి కుంటుపడుతుంది. మరోవైపు.. ఎన్నికలంటే భారీ ఎత్తున ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా తయారైంది. అభ్యర్థులు చేసే ఖర్చుపై గరిష్ఠ పరిమితి ఉన్నప్పటికీ.. అనధికారికంగా కోట్ల కొద్దీ నల్లధనం మార్కెట్‌లోకి ప్రవహించేది ఆ సమయంలోనే. జమిలి ఎన్నికలతో ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చనే అభిప్రాయం ఉంది.

india-modi-amit-shah-all-parties-assembly-polls-el

          మరోవైపు.. ఏకకాల ఎన్నికలు నిర్వహించినట్లయితే కేంద్ర సమస్యలు, విధానాలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయి. రాష్ట్ర లేదా ప్రాంతీయ సమస్యలకు అంతగా ప్రాధాన్యత లభించదు. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. కేంద్రంలో గెలిచే పార్టీకే రాష్ట్రంలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1999 నుంచి ఇప్పటి వరకు లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 1999 తర్వాత కేంద్రంలో విజయం సాధించిన పార్టీయే.. దేశవ్యాప్తంగా 77 శాతం రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఫలితంగా ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌కు అధిక సిబ్బంది అవసరం. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు భారీ సంఖ్యలో కావాలి. వాటి కొనుగోలుకే దాదాపు 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నది ఎన్నికల కమిషన్‌ అంచనా. అదొక్కటీ భరించగలిగితే ఖర్చు భారీగా తగ్గుతుంది.

india-modi-amit-shah-all-parties-assembly-polls-el

          మొత్తానికి మోదీ ప్రభుత్వం ప్రచారంలోకి తెచ్చిన జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న వారు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. జమిలి ఎన్నికలు విభిన్న రాజకీయ పరిస్థితులు కలిగిన భారత్‌ వంటి సమాఖ్య వ్యవస్థలో అమలు కావడం అసాధ్యమని చాలామంది అభిప్రాయం. ఈ తరహా ఎన్నికలు రాష్ట్రాల హక్కులను, అధికారాలను హరించి వేస్తాయనేది విశ్లేషకుల అంచనా. మరి చూద్దాం ఈ ప్రతిపాదన ఎంతవరకూ వీలవుతుందో..!!


india-modi-amit-shah-all-parties-assembly-polls-el
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.