ఏపీ కాంగ్రెస్ ని పరుగులు పెట్టిస్తానంటూ పంతం పట్టేసిన కేరళ పెద్దాయన, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ ఉత్తరాంధ్రలో అడుగు పెట్టేశారు. ఈ రోజు  విశాఖ వచ్చిన ఆయన శ్రీకాకుళం బయల్దేరారు.  ఆ తరువాత విజయనగరం చూసుకుని అట్నుంచి విశాఖ వస్తారన్న మాట. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు ఓ మోస్తరు స్వాగతం లభించింది. మిగిలి ఉన్న కాంగ్రెస్ నాయకులు గుంపుగా వెళ్ళి చాందీని కలిశారు.


అద్భుతమంటే అదేనట :


అద్భుతం అంటే కాంగ్రెస్ ఇలా డిపాజిట్లు కూఒడా దక్కించుకోకుండా చతికిలపడడమేనట. ఇంత కంటే ఏపీలోనూ, ఉత్తరాంధ్రలోనూ వేరే అద్భుతాలేవీ జరిగిపోవని సెటైర్లు పడుతున్నాయి. మాజీలంతా రావాలంటూ పిలుపు ఇచ్చినా ఇక్కడ పలికేందుకు మాత్రం ఎవరూ సిధ్ధంగా లేరన్నది వాస్తవం. పార్టీలో ఉన్న వారే పక్క చూపు చూస్తున్నారు. కొత్త పూజారి కాబట్టి చాందీ ఇలాగే అంటారని ఖద్దరు పెద్దలు కూడా అంటున్నారు.


జెండా పట్టే వారే లేరుగా :


శ్రికాకుళం జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లంతా వైసీపీలోకి వెళ్ళిపోయారు. పార్టీ జెండా పట్టుకునేవారే లేరక్కడ. మాజీ కేంద్ర మంత్రి కిల్లి క్రుపారాణి, మాజీ మంత్రి కోండ్రు మురళి వైసీపీ, టీడీపీ వైపు చూస్తున్నారని టాక్. గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉండగా చాందీ వెళ్ళి ఏం ఊడబొడుస్తారంటున్నారు. విజయనగరంలో బొత్స కుటుంబంతో పాటు, కోలగట్ల వీరభద్రస్వామి కూడా వైసీపీలోనే ఉన్నారు. వీరంతా వెనక్కు చూసే పరిస్థితి లేదు. విశాఖలోనూ సేం టు సేం. సో పెద్దాయన హ్యాపీగా నాలుగు రోజులు టూరేసి వెళ్ళిపోతారంటూ పంచ్ లు పేలుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: