హిందూపురంలో రాజ‌కీయం రంజుకుంటోంది.. అధికార టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నేత‌లు ఢీ అంటే ఢీ అంటున్నారు.. అభివ‌`ద్ధే జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అంటుంటే.. చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? అంటూ టీడీపీ నాయ‌కులు స‌వాల్ విసురుతున్నారు.. ఎన్నిక‌ల ముంగిట స‌వాలు, ప్ర‌తిస‌వాళ్ల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో రాజీకీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. అయితే, ఇక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్ర‌ముఖ హీరో నంద‌మూరి బాల‌క‌`ష్ణ‌ను టార్గెట్‌గా చేసుకుని వైసీపీ నాయ‌కులు ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాల్లో బిజీగా ఉంటూనే.. ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న బాల‌క‌`ష్ణ‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఓడించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళ్తున్నారు. 


 వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి న‌వీన్ నిశ్చ‌ల్ మాత్రం ఒక‌డుగు ముందుకు వేసి.. బాల‌య్య‌పై విరుచుకుప‌డుతున్నారు.. సినిమాల‌పై చూపిస్తున్న ప్రేమ నియోజ‌క‌వ‌ర్గంపై చూపించ‌డంలేద‌నీ.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డంలేద‌నీ బాల‌య్య‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. హిందూపురంలో ఎక్క‌డిస‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయ‌నీ, వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏనాడు కూడా బాల‌య్య వాటివైపు క‌న్నెత్తి చూడ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు. అయితే, ఇదేస్థాయిలో అధికార టీడీపీ నేత‌లు కూడా వైసీపీ నాయ‌కుల‌ను ఏకిపారేస్తున్నారు. బాల‌క‌`ష్ణ హ‌యాంలోనే హిందూపురం అభివ‌`ద్ధి చెందుతోంది.. వంద‌ల కోట్ల‌తో ప‌నులు చేప‌డుతున్నార‌ని చెబుతున్నారు.


అయితే..  వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురంలో బాల‌య్య ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ న‌వీన్ నిశ్చ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు. ఎమ్మెల్యేగా బాల‌య్య గెలిచిన త‌ర్వాతే  నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి జ‌రిగింద‌ని, ఈ నాలుగేళ్లలో ప‌ట్ట‌ణంలో అనేక అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని, దీనిపై చ‌ర్చించేందుకు సిద్ధ‌మేన‌ని మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ రావిళ్ల ల‌క్ష్మి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మెన్‌ రోషన్‌అలీ సవాల్‌ విసిరారు. రూ. 194 కోట్లతో ప్రత్యే క తాగునీటి పైప్‌లైన్‌, రూ.66 కోట్లతో రోడ్ల నిర్మాణ ప‌నులు చేప‌ట్ట‌నున్నార‌ని చెబుతున్నారు. నిరంత‌రం అభివ‌`ద్ధి కోసం ప‌రిత‌పిస్తున్న బాల‌య్య‌ను విమ‌ర్శించే అర్హ‌త వైసీపీకి లేద‌ని అంటున్నారు.

Image result for hindupur balakrishna

టీడీపీ, వైసీపీల మాట‌ల యుద్ధం కొన‌సాగ‌డానికి ఇటీవ‌ల వైసీపీ చేప‌ట్టిన ర్యాలీలో న‌వీన్ నిశ్చ‌ల్ చేసిన వ్యాఖ్య‌లే కార‌ణం. ఆ ర్యాలీలో ఎమ్మెల్యే బాలకృష్ణ, చైర్‌పర్సన్ ల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లపై మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చాంబర్‌లో టీడీపీ నాయకులు స‌మావేశ‌మై మండిపడ్డారు. హిందూపురం పట్టణాన్ని గ్రీన్‌ అండ్‌ క్లీన్‌ సిటీగా మార్చేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ, మునిసిపల్‌ పాలకవర్గం నిరంత‌రం పనిచేస్తుందన్నారు. పట్టణంలో పందులు, కుక్కలను బెడ‌ద లేకుండా వాటిని తరలించేందుకు మునిసిపాలిటీ సిద్దమ‌వుతున్న సమాచారాన్ని ముందస్తుగా తెలుసుకుని నవీన్‌ తన ఉనికి కోసం ర్యాలీ చేయ‌డం వైసీపీ దిగ‌జారుడు త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: